పన్నెండు మంది శిష్యుల కథ
గురువుగారు – పరమానందయ్యగరు.
వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు. పేరు పరమానందయ్యగారి శిష్యులు.
ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి..
అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి
కొంచం వివరంగా తెలుసుకుందాం.
పూర్వం దేవలోకంలో
పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా
ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ
ప్రయాణిస్తున్నారు.
వీరు వెళ్తున్న బాటనానుకొని
దట్టమైన పూపొదలు ఉన్నాయి. వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల
పద్మాలు కలిగిన కొలను ఉంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది. అప్పుడు
ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న
అనుమానంతో —- ” మీరంతా వట్టి బుద్ధి హీనులు
కండి” – అని శాపం ఇచ్చింది.
వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు –
“మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు. తాపసికి
అప్సరస తొందరపాటు కోపం వచ్చి – “నువ్వు ముందూ వెనుకా
చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు. కనుక – నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు” అని ఆమెను శపించాడు.
భూలోకంలో శివభక్తుడైన
మహరాజు ఉంటాడు. ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు
మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు. అతను మహా పండితుడు. ఆయన వద్ద ఈ పన్నెండు మంది
మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు. రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం
చేస్తుంటాడు.
ఆ మహాపండితుడే
ప్రమానందయ్యగారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు
కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు.
పరమానందయ్య గారు గొప్ప
పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో దిట్ట.
ఆయనకు రాజాశ్రమముంది. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.