వైదికమా? వ్యాపారమా ?
ప్రస్తుతకాలంలో, వైదిక వృత్తిని కేవలం బ్రాహ్మణులే కాక, అన్ని వర్ణములవారు ఆచరించవచ్చుననే వాదన వినిపిస్తోంది. ఇది ఆమోదయోగ్యమేనా ? వైదిక వృత్తిని ఆచరించే
వారందరూ బ్రాహ్మణులేనా? ..... అవును.
ప్రస్తుతం, ఈ కొత్తదైన వింత వాదన అన్నిచోట్ల వినిపిస్తూ వున్నది. నాస్తికలోకం, ఈ విషయాన్ని చాలా తెలివిగా ప్రచారం చేస్తున్నామని
అనుకుంటోంది. నిష్పాక్షికంగా, నిర్ద్వందంగా వుంటే మనమదరం కూడా ఈ వాదనను సమర్ధించవలసిందే. కానీ, వాదనలో ఎంతవరకు స్పష్టత
వున్నదనేది కూడా ఆలోచించాలి. ఎవరో నాస్తికులు వేసిన
విషపు బీజం, నిదానంగా ఈ హిందూ
ధర్మవ్యవస్థ మొత్తం పాకిపోతోంది. ఆ విషవృక్షం, ఆధ్యాత్మిక వ్యవస్థ మొత్తాన్ని సమూలంగా కప్పివేసేలోపు
నిర్ణయం తీసుకోలేకపోతే, మన హిందూధర్మం చరిత్రగా మిగిలిపోవలసినదే తప్ప, చేయగలిగేది ఏమి లేదు.
![](http://www.cgarena.com/freestuff/tutorials/max/iyer/iyer_highres.jpg)
వైదికవృత్తిని ఆచరిస్తున్న
బ్రాహ్మణేతరులందరినీ కూడా బ్రాహ్మణులనే
అంగీకరిద్దాం. కానీ, అంతకంటే ముందు ఈ నాస్తిక సమాజం చేయవలసిన పని మరొకటి
వున్నది. ఇతర వ్యాపార, ఉద్యోగములు చేసేవారందరినీ కూడా, వారు వున్న విభాగాన్ని బట్టి ఆయా కులములకు చెందిన
వాళ్ళేనని అంగీకరించండి. ఆ తర్వాత సక్రమంగా వున్న
వైదిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలో ఆలోచించండి. అంటే....... ,
వెండి, బంగారం నగల వ్యాపారం చేసే వారందరినీ కంసాలులని,
బట్టల వ్యాపారం చేసే
వారందరినీ సాలీలని,
బ్యూటీపార్లర్, సెలూన్ షాపులు నడిపెవారందరినీ మంగలివారనీ,
హస్తకళల వస్తువుల వ్యాపారం
చేసేవారందరినీ మేదరవారనీ,
చెప్పుల దుకాణాలు నడిపే
వారందరినీ కమ్మరి అని,
కిరాణా, ఫాన్సీ దుకాణాలు నడిపేవారందరినీ వైశ్యులని,
మిగతా వృత్తుల వారందరినీ,
వారు చేస్తున్న వృత్తులను బట్టి ఆయా కులములకు
చెందినవారిగా అంగీకరించండి.
ఇప్పటికే అనేక వృత్తులవారు,
నాస్తికభావాల ప్రభావంతో ఆత్మన్యూనత భావనను
పెంచుకొని, వంశానుచరితంగా వస్తున్న
వృత్తులను వదిలివేస్తూ, ఆదాయం కోసం వేరే వృత్తులను
ఎంచుకోవటం జరుగుతోంది తద్వారా ఈ కులవృత్తులు అన్నీ అస్తవ్యస్తం కావటం చూస్తూనే వున్నాం.
నిన్నటివరకు, మరే దేశంలో లేని విధంగా అత్యంత అందమైన కులవృత్తి విధానం మన
దేశంలో వుండేది.
ఇటువంటి నాస్తిక
చర్యలను ప్రోత్సహించేవారందరూ నాస్తికులే. ఈ విధమైన ప్రయోగాల వలన
ఆధ్యాత్మిక వ్యవస్థ తద్వారా ధార్మిక సమాజం అస్తవ్యస్తం కావటం తప్ప, లభించే ప్రయోజనం ఏమి లేదు. భక్తులందరూ, ఈ నాస్తిక చర్యలను నిర్ద్వందంగా ఖండిస్తారని ఆశిద్దాం.
చివరగా ఒక్కమాట : నేటి సమాజంలో, చాలామంది ఆధునిక భావాలతో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ, నాస్తిక భావాలలో చిక్కుకొని అనాలోచితంగా మారిపోతున్నామని
తెలుసుకోలేకపోతున్నారు. ఆ సత్యాన్ని గ్రహించేసరికి
హిందూధర్మము యొక్క పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం వున్నది. ఇది ఆలోచించే సమయం కాదు.
స్థిరమైన నిర్ణయం తీసుకునే సమయం. వైదికము అత్యంత పవిత్రమైన వృత్తి. ఈ వైదిక వ్యవస్థ నిర్వీర్యం
కావటం సమాజానికి ఎంతో ప్రమాదకరం.