తాటి దూలంలో సూది
ఓకసారి పరమానందయ్యగారికి
సూది అవసరమొచ్చింది. ఆయన శిష్యులను పిలిచి
సూది తీసురమ్మని చెప్పారు. శిష్యులంతా బజారుకి సూదికోసం బయలుదేరారు. సూది కొన్నాక
వాళ్ళకు ఒక అనుమానం కలిగింది.
“ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి
గురువుగారికివ్వాలి?” అందరూ “నేను.”….”.నేను” .. అంటూ పోటి పడ్డారు.
ఆ గొడవ తేలేలా కనిపించలేదు
ఇలా ఉండగా, ఓ శిష్యుడికి కొంత దూరంలో
ఒక తాటిదూలం ఒకటి కనిపించింది. అతనికి ఓఆలోచన వచ్చిది.
![](http://ppcdn.500px.org/25020209/827879cf6bf69742e32172b7637899bbb47910ef/5.jpg)
ఈ ఆలోచన మిగతా శిష్యులకు
కూడా నచ్చింది. వాళ్ళు “సరె” అన్నారు.
ఆ దూలం తీసుకొని దానికి
సూది గుచ్చి, పన్నెండుమంది
శిష్యులు మోసుకువెళ్ళారు. ప్రజలంతా వారి తెలివితక్కువ తనానికి ఎంతగానో
నవ్వుకొన్నారు. మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటిదూలాన్ని గురువుగారి దగ్గరకు
తీసుకువెళ్ళారు.
గురువుగారు ఆశ్చర్యంతో ఏమి
జరిగింది అని అడిగారు. శిష్యులు జరిగినదంతా చెప్పారు. అది విని “సూదికోసం తాటి మాను మోసుకొస్తారా! ఇంతకీ సూదేదీ?” అని అడిగారు
అందరూ తాటిమానులోని సూది
వెతికారు. ఎంత వెదికినా దొరకలేదు. చివరికి
గురువుగారు వెదికినా దొరకలేదు. “మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్తా ఎక్కడో జారిపోయి
ఉంటుంది. ముందు ఈ మాను తీసుకెళ్ళి దాని యజమానికిచ్చిరండి” అని నిరుత్సాహపడ్డారు ఆ గురువుగారు.