బలవంతుడు అయిన శత్రువు దగ్గర ఎలా ఎదుర్కోవాలి?
బలవంతుడు అయిన శత్రువు దగ్గర సమయం వచ్చే
వరకు నమస్కారం పెట్టి అణిగిమణిగి ఉండాలి! స్నేహం చేయాలి! నమ్మినట్టే ఉండాలి కానీ
నమ్మకూడదు! ఎందుకంటే బలవంతుడు కాబట్టి ప్రమాదం వస్తుంది కాబట్టి! దీనికి ఒక మూషిక,
మార్జాల సంవాదం ఉంది!
ఒక అడవిలో ఒక చెట్టు కింద
ఉన్న బొరియలో ఎలుక నివాసం ఉంటుంది! అదే చెట్టుపైన పిల్లి నివాసం ఉంటుంది! ఎలుక
పిల్లికి భోజన పదార్ధం కాబట్టి ఎప్పుడు దాని జాగ్రత్తలో అది ఉండేది! అదే అడవిలో ఒక
బోయవాడు వల పన్ని దానిలో పడిన పశు పక్ష్యాదులని ఆహారంగా సంపాదించుకునేవాడు! ఒకరోజు
ఆ బోయి వలలో పిల్లి చిక్కుంది! అదిచూసిన మూషికం ఆనందంతో అటు ఇటు తిరుగుతూ ఉంది!
ఇంతలో గుడ్లగూబ, ముంగిస దాన్ని చూసి
తినేయడానికి ముందుకు వస్తుంటే అది గమనించిన ఎలుక పిల్లితో సంధికి వచ్చింది!

దానికి బదులుగా ఎలుక నా
ప్రాణాలు నువ్వు కాపాడావు! నీ ప్రాణాలు నేను కాపాడాను ఇంకా ఇంతటితో నీకు నాకు
చెల్లు వెళ్ళు! పిల్లి మృదు మధుర స్వరంతో మిత్రమా నీకు ఈ లేనిపోని ఆందోళన ఎందుకు?
నా ప్రాణాలు కాపాడిన ప్రతిఫలం దక్కించుకో!
నిన్ను నా భంధవులకి పరిచయం చేస్తాను! ఐశ్వర్యాలు ఇస్తాను, సత్కారాలు చేస్తాను! నిన్ను గౌరవంగా చూసుకుంటాను అంది! కానీ
ఎలుక! మిత్రమా నువ్వు ఇప్పుడు నేను నీ ప్రాణాలు కాపాడిన కృతజ్ఞత ఉండొచ్చు! కానీ
నేను నీకు భోజ వస్తువుని! నాకంటే నువ్వు బలవంతుడివి! దానికి తోడు నిన్న రాత్రి
వలలో చిక్కుకున్నావు! ఆకలి మీద వున్నావ్! నేను బయటకి వచ్చిన వెంటనే నా పైబడి
చంపేయగలవు! ఇప్పుడు కాకపోయినా తరువాత అయిన నా ప్రాణాలు హరించగలవ్!
బలవంతుడు అయిన
శత్రువుతో చెలిమి ప్రాణ సంకటం! అవసరం కోసం ఆశ్రయించవచ్చు కానీ కలకాలం స్నేహం
కొనసాగించరాదు! కాబట్టి ఇక నీవు మరలిపోవచ్చు! నీకు నాకు స్నేహం కద్దు! ఆ మాటలకి
పిల్లి సిగ్గుపడి వెళ్ళిపోయింది! ఎలుక ఇంకా ఈ బొరియలో ఉండటం మంచిది కాదని వేరొకచోట
నెలవు ఏర్పరచుకొని సంతోషంగా జీవించింది!
కాబట్టి బలవంతుడు అయిన
శత్రువుతో ఎల్లకాలం స్నేహం చేయకుండా, తగవులు
పెంచుకోకుండా సందర్బాన్ని బట్టి లోంగినట్టు ఉంటూ స్నేహాన్ని అవసరం మేర చేసి తరువాత
రామ్ రాం చెప్పేయాలి!