లింగ ,శివ పురాణాలలో నారదీయం

ఒకప్పుడు నారదుడు హిమాలయం పై తపస్సు చేస్తున్నాడు .ఇంద్రుడు విఘ్నం చేయమని దేవకన్యల్ని పంపాడు నారదుడు శివారాధకుడు కూడా కనుక శివ ప్రభావం వల్ల మనసు చలించలేదు .దీనితో గర్వం వచ్చింది .తపస్సు ముగించి ,బ్రహ్మ విష్ణువు లను చూడటానికి వెళ్ళాడు .తన ప్రభావం వల్లనే శివుడు కాముడిని జయించాడని విష్ణు మూర్తి తో అంటాడు .పరీక్షించే నెపం తో విష్ణు మూర్తి మార్గ మద్యం లో ఒక నగరాన్ని నిర్మించి ,అందులో అతి లోక సౌందర్య రాశి ని సృష్టించి ఉంచుతాడు .ఆమెను చూడగానే ప్రేమలో పడ్డ నారదుడు ఆమె ను వివాహమాడే నిమిత్తం విష్ణు రూపాన్ని తనకిమ్మని కోరుకొంటాడు.

నారదుడు ,అతని మేనల్లుడు పర్వతుడు అంబరీషుని నగరానికి వచ్చి అతని కుమార్తె శ్రీమతిని చూస్తారు ఇద్దరు  ఆమె పై మనసు పదడి పోటీ పడతారు .ఇద్దరిలో ఒక్కరికే తన కుమార్తె నిస్తానంటాడు తండ్రి .ఇంతలో ఒకరికి తెలియ కుండా ఇంకొకరు విష్ణువు ను చేరి అవతలి వాడి ముఖం కోతి ముఖం చేయమని కోరుకొంటారు .స్వయం వరం లో శ్రీమతి విష్ణువునే వరిస్తుంది .ఆమెతో వైకుంఠానికి విష్ణువు చేరుకొంటాడు .వీరిద్దరికీ కోపమొచ్చింది .అమ్బరీషునితో తగాదా పడతారు .అతడిని ‘’తమో మయుడవు కావలసినది ‘’అని శపిస్తారు .ఇంతలో విష్ణు చక్రం వీరిద్దరిని తరుము కొం.టు వచ్చింది .పారి పోయి విష్ణు లోకం చేరారు .’’వానర ముఖాలు మాకు ఇచ్చి నువ్వు కన్య ను కొట్టేశావు ‘’కనుక నరుడి వై వియోగ దుఖం అనుభవించమని విష్ణువు ను శపించారు .చివరికి ఆ వానరుల సహాయంవల్లనే భార్యను మళ్ళీ పొందుతావు అని చెప్పారు .ఇదంతా శివుని ప్రభావమే నని వీరిద్దరికీ తెలియ జెప్పి విష్ణువు అంతర్ధాన మయ్యాడు .ఇదే శ్రీ రామావతారానికి ప్రాతి పాదిక అయింది

మహా భారత కదా విధానం
                   నారద పర్వతులు లోక సంచారం చేస్తూ ఒకరి హృదయం లో ఉన్నది వేరొకరికి  దాచకుండా చెప్పుకోవాలని ,అలా చెప్పుకోక పోతే అవతల వాడిని శపించాలని ఒక ఒడంబడిక చేసుకొన్నారు .ఇద్దరు సృన్జయుడు అనే రాజు దగ్గరకు వచ్చారు .వీరి పరిచర్యలకు తన కుమార్తె ‘’సుమాలిని ‘’ని నియమించాడు .నారదుడు ఆమె పై మనసు పారేసుకొన్నాడు కాని ఆ సంగతి పర్వతుడికి చెప్పలేదు .పర్వతుడు ఇది గ్రహించి నారదుడి ని కోతి ముఖం తో ఉండమని శపించాడు .నారదుడు పర్వతునికి లోక సంచారం లేకుండా ఉండే శాపం ఇచ్చాడు .నారద సుకుమారిల పరిణయం జరిగింది .కొంతకాలానికి మామా అల్లుడు కలుసుకొన్నారు .శాప విమోచనం చేసుకొన్నారు .ఇంటికి తిరిగి వచ్చిన నారదుడిని భార్య గుర్తించలేదు అప్పుడు పర్వతుడే ఆమె కు అతనే ఆమె భర్త అని నిజాన్ని చెప్పాడు .

             నారదుడు మామ సృన్జయునికి  దేవతలను మించిపోయే పుత్రుదు కలిగే వరం ఇచ్చాడు అక్కడే ఉన్న పర్వతుడు ఆ పుట్టబోయే వాడు అల్పాయుష్కుడు ‘’అన్నాడు . .రాజు దుఖిస్తే ‘’ఇంద్రుడు నీ పుత్రుడిని సంహరిస్తాడు .అప్పుడు నన్ను తలచుకో. నేనే బ్రతికిస్తాను ‘’అని అభయమిస్తాడు నారదుడు .సృన్జయుడికి పుత్రుడు కలిగాడు అతని నిస్టేవనం(ఉమ్మి, విసర్జనం మొదలైనవి ) బంగారు అవటం వల్ల అతనికి  ‘’సువర్ణ స్టేవి ‘’అని పేరు పెట్టారు .అతని శరీరం అంతా బంగారుమయమే నని భ్రమించి దొంగలు అతన్ని చంపేశారు .నారడుకి ఈ విషయం తెలిసి పునర్జీవితుడిని చేశాడు కాని  .ఇంద్రుడు కోపం తో చంపమని వజ్రాయుధం పంపాడు  .రాజు తన అల్లుడైన నారదుడిని తలచుకొన్నాడు .మళ్ళీ బ్రతికించి తన మాట నిల బెట్టుకొన్నాడు నారదుడు ఇలా మామ గారి వంశాన్ని నిల బెట్టి పుణ్యం కట్టుకొన్నాడు అల్లుడైన నారదుడు