తెలుగు మాసములలో తిధి, వార, నక్షత్రమును బట్టి వచ్చే పండుగలు.


చైత్రమాసం 
- చైత్ర శుద్ధ పాడ్యమి చిత్త నక్షత్రం, సంవత్సరాది లేక ఉగాది (యుగాది) పండుగ జరుపుకొంటారు. ఈ రోజుతో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. 
- చైత్ర శుద్ధ విదియ ఉత్తమ మన్వంతరం (సౌభాగ్య గౌరీ వ్రతం) 
- చైత్ర శుద్ధ పంచమి వరాహ జయంతి (శ్వేతవరాహ కల్పం, ఆరంభం) 
- చైత్ర శుద్ధ నవమి శ్రీ రామ నవమి. 
- చైత్ర శుద్ధ ఏకాదసి రుక్మిణీ పూజ 
- చైత్ర శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్రములో రౌచ్యక మన్వంతరం. 
- చైత్ర బహుళ పంచమి మత్స్యావతార జయంతి. 
- చైత్ర అమావాస్య 'కూర్మ కల్పాదీ (కూర్మ కల్పము ఆరంభం అయిన రోజు) చైత్రమాసం అంతము.


వైశాఖ మాసం 
- వైశాఖ శుద్ధ తదియ విశాఖ నక్షత్రము బలరామ జయంతి(త్రేతాయుగాది), అక్షయ తృతీయ 
- వైశాఖ నవమి ద్వాపరయుగాంతము (వృషభ సంక్రమణ పుణ్యకాలము) 
- వైశాఖ చతుర్దశి నరసిమ్హావతార జయంతి. 
- వైశాఖ పూర్ణిమ బుద్ధావతార జయంతి. 
- వైశాఖ బహుళ తదియ పార్ధవ కల్పాది. 
- వైసఖ బహుళ దశమి నాడు మనము 'హనుమజ్జయంతి 'జరుపుకొంటాము.

జ్యేష్ఠమాసం 
- జ్యేష్ఠ పూర్ణిమ నక్షత్రము భౌచ్యక మన్వంతరం. 
- జ్యేష్ఠ బహుళ ద్వాదసి కూర్మావతార జయంతి.


ఆషాఢ మాసం 
- ఆషాడ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణిమ(మూడు రోజుల పండుగ) 
- ఆషాఢ శుద్ధ దసమి పూర్వాషాఢా నక్షత్రం చాక్షుష మన్వంతరం. 

శ్రావణ మాసం
- శ్రావణ శుద్ధ విదియ మంగళగౌరీ వ్రతము 
- శ్రావణ పూర్ణిమ శ్రవణా నక్షత్రం హయగ్రీవ జయంతి, కృతయుగాంతము జంద్యాల పూర్ణిమ లేఖ 'రాఖీపౌర్ణమి
- శ్రావణబహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి లేక కృష్ణాష్టమి. 
- శ్రావణ అమావాస్య రుద్రసావర్ణిక మన్వంతరం.

భాద్రపద మాసం
- భాద్రపద శుద్ధ తదియ పూర్వాభాద్రా నక్షత్రం తామస (తాపస) మన్వంతరం.
- భాద్రపద శుద్ధ చతుర్థీ వినాయక చవితి.
- భాద్రపద శుద్ధ ద్వాదశ వామన జయంతి
- భాద్రపద, బహుళ అమావాస్య మహాలయ అమావాస్య
  
ఆశ్వీజ మాసం 
- ఆశ్వీజ శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రులు ప్రారంభం 
- ఆశ్వీజ పంచమి ఉపాంగ లలితా వ్రతము 
- ఆశ్వీజ సప్తమి సరస్వతీ పూజ 
- ఆశ్వీజ అష్టమి దుర్గాష్టమి 
- ఆశ్వీజ నవమి స్వ్రోచిష మన్వంతరం, మహార్నవమి 
- ఆశ్వీజ దశమి విజయ దశమి (దసరా) అపరాజితా పూజ శమీ పూజ, దుర్గాదేవి ఉద్వాసనము. 
- ఆశ్వీజ బహుళ చతుర్ధశి నరక చతుర్దశి; లక్ష్మీ ఉద్వాసనము 
- ఆశ్వీజ బహుళ అమావాస్య అశ్వినీ నక్షత్రం దీపావళి

కార్తీక మాసము
- కార్తీక మాసము
- కార్తీక శుద్ధ నవమి కృతయుగాది (అక్షయ నవమి)
- కార్తీక శుద్ధ ద్వాశమి స్వాయంభువ మన్వంతరము క్షీరాబ్ది ద్వాదశి
- కార్తీక శుద్ధ పూర్ణిమ కృత్తికా నక్షత్రం కుమార స్వామి దర్శనం; కార్తీక దీపం; దక్షసావర్ణిక మన్వంతరం (తులసీ పూజ - ధాత్రీపూజ)
- కార్తీక బహుళ తదియ త్రేతాయుగాంతము.

మార్గశిర మాసం 
- మార్గశిరశుద్ధ - షష్ఠి మృగశిరా నక్షత్రం స్కంద - షష్ఠి (సుబ్రమణ్య షష్టి) 
- మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతము 
- పుష్య మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి
- మార్గశిర పూర్ణిమ దత్త జయంతి 
- మార్గశిర బహుళ విదియ పరశురామ జయంతి
- మార్గశిరం లేక పుష్యమాసంలో సంక్రాంతి
  
మాఘ మాసం 
- మాఘశుద్ధ అష్టమి మఘా నక్షత్రం భీష్మాష్టమి
- మాఘ మాసం సప్తమి సూర్య సప్తమి (రధసప్తమి)
- మాఘ బహుళ చతుర్ధశి శివరాత్రి
- మాఘ బహుళ అమావాస్య, మాఘమాసాంతము ద్వాపరయుగాది

ఫాల్గుణమాసం 
- ఫాల్గుణశుద్ధ పూర్ణిమ పూర్వఫాల్గుణీ నక్షత్రం బ్రహ్మిసావర్ణిక మన్వంతరము, హోళీ పండుగ(హోళికా పూర్ణిమ)

- కుంభ అసంక్రమణము కల్కి జయంతి