మాసానాం మార్గశీర్షోహం

శ్రీకృష్ణునికి ధనుర్మాసం 30 రోజులు తులసి మాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగు తుంది. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ముక్కోటిఏకాదశి గాను వైకుంఠ ఏకాదశిగాను ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశినాడు విష్ణువు సర్వాలంకారాలతో శ్రీదేవి, భూదేవిలతో గూడి గరుడ వాహనారూఢుడై వైకుంఠానికి విచ్చే యగా వైకుంఠ ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు మహావిష్ణును సేవించారని అందుకే ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయ్యిందని పురాణకథనం.
భగవద్గీతావిర్భావం జరిగింది, గీతా జయంతికూడా ఈ శుద్ధ ఏకా దశినాడే. ఈ గీతా జయంతినాడు భగవద్గీతను పూజించి, గీతా పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొంద వచ్చును. ఇక మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు తిరుమలలోని స్వామిపుష్కరిణికి తీర్థ దినంగా చెబుతారు.
ఈ రోజున సూర్యోదయం వేళ భూలోకంలో ఉండే మూడుకోట్ల తీర్థరాజాలు స్వామివారి పుష్కరిణి లోనికి చేరుతాయట.
చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదోనెల. ఋతువులలో అయిదవదైన హేమంత ఋతువు ఈ మార్గశిరమాసంతోనే ప్రారంభమౌతుంది. ఆధ్యాత్మిక సాధనకు ఈ మాసం ఎంతో విశేషమైంది. కార్తీకమాసం శివపూజకు విశేషమైనట్లుగానే మార్గశిర మాసం విష్ణ్వారాధనకు ప్రత్యేకమైంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఈ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉంది. మార్గశిర మాసం అంటే మానవుడు తన జీవన పథాన్ని ఎంచుకోవడానికి ఉత్తమమైన కాలమిది. మార్గం అంటే దారి, బాట, అన్వేషణ అని అర్థం. శీర్షమంటే తల, మెదడు అని అర్థం ఉంది. శరీర అవయవాలలో శ్రేష్ఠమైనది తల. అదే విధంగా సన్మార్గాన్ని ఎంచుకోవడానికి శ్రేష్ఠమైన మార్గాన్నే ఈ మాసం నిర్దేశిస్తుంది. వేదకాలంలో ఆయనాంశం (సంవత్సరారంభం) ఈ మాసంతోనే అయ్యేదట. కనుకనే ఈ మాసానికి 'అగ్రహాయదీక' అనేది పురాణ నామం. చల్లదనం (చలి) ఈ మాసం ప్రత్యేకత. ప్రాణులన్నీ దృఢతరంగా, బలవర్ధకంగా ఎదగడానికీ తగిన పరిస్థితులు ఈ మాస వాతావరణంలో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కాలంలో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతో షంగా ఉంటారు. నిర్మలమైన ఆకాశం మాదిరిగా ఈ మాసంలో మనస్సులు నిర్మలంగా ఉంటాయి. ఈ మాసం ఎన్నో పర్వాలకు నెలవు. ఈ మాసంలో భగవంతునికి నివేదించే వంటలలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు చింత పండు మొదలైన వాటిని విరివిగా విని యోగిం చాలని చెబుతారు. ఇందులో ఆరోగ్య పరమైన అంశం కూడా ఇమిడి ఉంది. వాతావరణ పరంగా చూస్తే కార్తీక మాసంలో ప్రారంభ మైన చలి మార్గశిర మాసంలో బాగా ప్రబలుతుంది. అందుకే ఆహా రంలో ఔషధ విలువలు గల పై పదార్థా లను వినియోగించ బడుట వలన క్షార గుణం హరించబడి, దేహానికి ఊష్ణశక్తి పుట్టి స్తుంది. ఆకారణం తోనే మన పూర్వీకులు మార్గశిర మాసంలో ఉష్ణాన్ని కలిగించే ఆయా పదార్థాలను విరివిగా భుజించా లనే నియ మాన్ని విధించి ఉంటారు.
ఐశ్వర్యానికి ప్రతీక అయిన శ్రీమహాలక్ష్మీదేవికి, త్రిమూర్తులలో స్థితికారకుడైన శ్రీమహా విష్ణు వుకు, ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉన్న ప్రత్యక్ష దేవుడైన శ్రీసూర్యభగవానుడి పూజలకు ఉత్కృష్టమైన మాసంగా పేరు పొందిన మాసం మార్గశిర మాసం. వాస్తవంగా ఈ మాసం పేరు 'మార్గశీర్షి మాసం'. అయితే కాల క్రమంలో మార్గశిర మాసంగా మారింది. శివపార్వతుల తనయుడైన శ్రీసుబ్రహ్మణ్యస్వామి, యోగయుక్తుడైన, మహాత్ముడు అయిన దత్తాత్రేయులు జన్మించింది ఈ మాసంలోనే. ఈ నెలలోనే సూర్యుడు వృశ్చిక రాశిలోంచి ధనస్సురాశిలోకి ప్రవేశంతో ధనుర్మాసం ప్రారంభమౌతుంది. భగవంతుడు మార్గశిర మాసంలో యోగ నిద్ర నుండి లేచి వరదాయకుడు అవుతాడు. భగవద్గీత జయంతి ఈ నెలలలోనే వస్తుంది. ముక్కోటి ఏకాదశి కూడా ఈ నెలలోనే వస్తుంది. శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం కనుకనే శ్రీకృష్ణపరమా త్ముడు ఈ మాసాన్ని భగవద్గీత విభూతి యోగంలో
'బృహత్సామ తథాసామ్నం
గాయత్రీ ఛందోసామహం
మాసానాం మార్గశిర్షోహం
బుూతూనాం కుసుమాకర: అన్నాడు.
సామవేదంలో బృహత్సామాన్ని ఛందస్సులో గాయత్రిని, మాసాల్లో మార్గశిర మాసాన్ని , ఋతువులలో వసంత ఋతువును నేను అని పేర్కొన్నాడు స్వయంగా పరమాత్మ స్వరూపమైన ఈ మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం ఎంతో
పుణ్య ప్రదం. ప్రతిరోజూ ప్రాత: కాలముననే నన్ను స్మరిస్తూ స్నానమాచరించి నన్ను ప్రార్థించే వారికి నన్ను నేనే పూర్తిగా సమర్పించుకుంటాను అని స్వయంగా శ్రీమహావిష్ణువు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి చెప్పినట్లు కథనం.
ఈ మాసపు శుక్లపాఢ్యమి నాడు గంగానదీ (కుదరకపోతే) గంగను స్మరిస్తూ స్నానం చేస్తారు. ఇలా చేస్తే కోటి సూర్య గ్రహణాల సమయంలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు.
భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టతగల సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజును 'సుబ్రహ్మణ్యషష్ఠిగా జరుపు కుంటారు. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఉన్నట్లు కనబడుతుంది. తారకాసురడనే రాక్షసుని సంహరించ డానికి జన్మించిన కారణ జన్ముడు కుమారస్వామి. ఈ స్వామినే కార్తికేయుడు, షణ్ముగుడు, స్కంధుడు, మురుగన్‌ పేర్లతో పిలుస్తారు. కాగా తెలుగు ప్రాంతంలో ఈ షష్ఠి ''సుబ్బ రాయషష్ఠి'' గా పేర్కొం టారు. ఈ రోజు స్వామిని షోడ శోప చారాలతో పూజిం చాలి. ఈ పూజవలన పిల్ల లకు బుద్ధి వికసిస్తుందట. శుద్ధసప్తమిని నంద
సప్తమిగా పిలుస్తారు. ఈ వ్రతాన్ని భవిష్యత్పురాణం చెబుతోంది. ఈ రోజు సూర్యుని యధా విధిగా పూజించి దధ్యోధ నాన్ని నివేదించాలి. ఉపవ సించి రాత్రి భుజించవచ్చు. ఈ వ్రతాచరణవల్ల జీవితం ఆనందమయంగా ఉంటుందని పై పురాణం తెలియచేస్తోంది. నందాసప్తమే కాకుండా కొందరు ఈ సప్తమిని భద్రాసప్తమిగా జరుపు కుంటారు. ఇది సూర్యుని ఉద్దేశించి చేసే వ్రతమే. ఈ వ్రతంలో ఆవుపాలు, ఆవునెయ్యి, చెరకు రసాలతో సూర్యుని అభిషేకించి పూజించాలి. ఆ రోజు ఉపవాసం ఉండి, మరుసటి రోజు అష్టమినాడు పారణ చేసి భోజనం చేయాలి.
శ్రీకృష్ణునికి ధనుర్మాసం 30 రోజులు తులసి మాల సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగు తుంది. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి గాను వైకుంఠ ఏకాదశిగాను ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి నాడు విష్ణువు సర్వాలంకారాలతో శ్రీదేవి, భూదేవిలతో గూడి గరుడవాహనా రూఢుడై వైకుంఠానికి విచ్చేయగా వైకుంఠ ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు మహావిష్ణును సేవించారని అందుకే ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయ్యిందని పురాణకథనం.
భగవద్గీతా విర్భావం జరిగింది, గీతా జయంతికూడా ఈ శుద్ధ ఏకాదశినాడే. ఈ గీతా జయంతి నాడు భగవద్గీతను పూజించి, గీతాపారా యణం చేయడం వలన మంచి
ఫలితాలు పొందవచ్చును. ఇక మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు తిరు మలలోని స్వామి పుష్కరిణికి తీర్థ దినంగా చెబుతారు. ఈ రోజున సూర్యోదయం వేళ భూలోకంలో ఉండే మూడుకోట్ల తీర్థరాజాలు స్వామివారి పుష్క రిణి లోనికి చేరుతాయట. అందుకే ఈ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం ఎంతో ప్రవి త్రంగా భావిస్తారు. ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మాండపురాణం, భాగవతం, వైఖాన సం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి.
అత్రి అనసూయల పుత్రుడైన ''దత్తాత్రేయుడు'' జన్మించినది ఈ మాస శుద్ధ పున్నమి రోజే 'దత్తజయంతి'గా జరుపుకుంటారు. ఆయన పుట్టుకవల్ల మార్గశిరం మహాద్భుత మాసమైందని శివపురాణం పేర్కొంది.

గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని పొందింది ఈ మాసంలోనే. గోదాదేవి తిరుప్పావై రచించి పాడింది శ్రీరంగనాథుని సేవించి తరించిందీ ఈ మాసంలోనే.