ఆధ్యాత్మిక వనంలో ‘ఐదు’ ప్రాముక్యత!!


మన పురాణాలలో ఐదుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరీ మంత్రంతో మొదలై పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు అంటూ ఐదు సంఖ్యతో కూడిన సంగతులు అనేకం! వాటిలో కొన్ని వివరాలు:
పంచామూర్తులు: శ్రీగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీపరమశివుడు, శ్రీపార్వతీదేవి, శ్రీచండీకేశ్వరుడు మొదలైన ఐదుగురు మూర్తులను శైవక్షేత్రాలలో పంచామూర్తులుగా పూజిస్తుంటారు.
పంచాయతనం: ఒకే పీఠం పై ఐదుగురు దేవతలను ఆవాహన చేసుకుని పూజించడం.
పంచమాతలు: తన తల్లి, గురువు భార్య, రాజు భార్య, తన భార్య తల్లి (అత్త)లను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని పంచమాతలు అనంటారు.
పంచపితృమూర్తులు: జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నంపెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు.
పంచప్రతిష్ట: పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఐదు రకాలైన ప్రతిష్ఠలు జరుగుతుంటాయి.
స్థాపన: నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
ఆస్థాపన: కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
మైస్థాపన: పడుకున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
పరస్థాపన: వాహనాలపై పలు భంగిమలలో చేసే ప్రతిష్ఠ
ప్రతిష్ఠాపన: షణ్మార్చనతో చేసే ప్రతిష్ఠ
శివపంచాయతనం: మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించి చుట్టూవున్న ప్రదక్షిణంలో సూర్యుడు, వినాయకుడు, అంబిక విష్ణువులను ప్రతిష్టించి పూజించడమే శివ పంచాయతనం.

పంచయజ్ఞాలు: జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు, కుండ ఈ ఐదింటిని వాడటంవల్ల పాపం వస్తుంది. వీటి నివారణకు చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలనంటారు.
దేవయజ్ఞం: అగ్నితో హోమం చేయడం.
పితృయజ్ఞం: పితృకార్యాలను చేయడం.
భూతయజ్ఞం: జంతువులకు ఆహారాన్ని అందివ్వడం
మానుషయజ్ఞం: విందును ఇవ్వడం
బ్రహ్మయజ్ఞం: రోజూ వేదపఠనం చేయడం
పంచాహోమాలు:
గణపతి హోమం: అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేందుకై చేసే హోమం.
చండీహోమం: దరిద్రం, భయాలు తొలగేందుకు చేసే హోమం.
నవగ్రహ హోమం: గ్రహదోషం తొలగేందుకు నవగ్రహ హోమం.
సుదర్శన హోమం: సమస్త దోషాలు తొలగేందుకు చేసే హోమం.
రుద్రహోమం: అయుర్ వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమం.

పంచయాగాలు:
కర్మయాగం:భగవంతునికి పూజ చేయడం.
తపయాగం:వ్రతం చేయడం.
జపయాగం:మంత్రాలను జపించడం.
ధ్యానయాగం:భగవన్నామాన్ని ధ్యానించడం.
మంత్రయాగం:వేదగ్రంథాలను పఠించడం.

పంచాతాండవం: ఆనందతాండవం, సంధ్యాతాండవం, త్రిపురతాండవం, ఊర్థ్వతాండవం, ముని తాండవం

పంచనాథ స్థలాలు:
కాశీ శ్రీవిశ్వనాథుడు
గుజరాత్ శ్రీసోమనాథుడు
పూరి శ్రీజగన్నాథుడు
రామేశ్వరం శ్రీ రామనాథుడు
వైదీశ్వరం శ్రీవైథీశ్వరుడు

పంచభగవతి స్థలాలు:
కొల్లూరు మూకాంబిక
వడగరా లోకాంబిక
పాల్ ఘాట్ హోమాంబిక
కొడూంగబారు మహాభగవతి
కన్యాకుమారి బాలాంబిక

పంచదేవి: దుర్గ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రిలను పంచదేవిలు అనంటారు. 
పంచనదం: దూతపాప, కిరాణానది, ధర్మనది, గంగ, యమునా నదులను కలిపి పంచనదాలంటారు. ప్రస్తుత పంజాబ్ కూడ ఒకప్పుడు పంచనదం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. 
పంచపర్వాలు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు. 
పంచబ్రహ్మాసనం: భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దృశ్యమానప్రపంచం వీటి వల్లే ఏర్పడుతోంది.

పంచలింగాలు:
పృథివీలింగం కంచి

ఆపల్లింగం జంబుకేశ్వరం
తేజోలింగం అరుణాచలం
వాయులింగం శ్రీకాళహస్తి
ఆకాశలింగం చిదంబరం

పంచవటం:  గోదావరి తీరంలో ఉంది. ఇక్కడ ఐదు వటవృక్షాలు (మర్రిచెట్లు) ఉండటంతో పంచవటి అని అన్నారు. ఈ ఐదు మర్రివృక్షాలు గత జన్మలో గంధర్వులు. అగస్త్యుడిని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి, అతని శాపానికి గురై వృక్షాలుగా మారుతారు. శ్రీరామదర్శనంవల్ల శాప విమోచనమవుతుందని చేయుతాడు. ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. 
పంచాక్షరీ: నమశ్శివాయ అనే ఐదాక్షరాల మంత్రం. 
పంచాయతనం: కాశీలోని శివుని విగ్రహం. శివుని ఐదు ఆత్మలు ఐదు ఆయతనాలు అవి: శాంతి, అతీత శాంతి, పరాపర విద్య, ప్ర్రతిష్ట, నివృత్తి. 
పంచపాండవులు: పాండురాజు కుమారులు. 
పంచత్రంత్రం: చిన్న పిల్లలకు జీవితమ పట్ల అవగాహన కలిగేందుకు విష్ణుశర్మ రాసిన కథల పుస్తకం.

పంచద్వారక: బద్రీనాథ్, పూరీ, అయోధ్య, ద్వారక, పండరీపురం.