మార్గశిర మాస వైశిష్ఠ్యం
భగవద్గీత పదవ అధ్యాయం "విభూతియోగము" లో 19 నుండి 42 శ్లోకములో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులను
గోర్ర్చియు, తన యోగ శక్తులను గూర్చియు
అర్జునునికి వివరిస్తాడు.
“కురు శ్రేష్టు డవైన ఓ అర్జునా... నా దివ్య విభూతులకు వాటి
విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైనవి
కొన్నిటిని మాత్రము నీకు వివరిస్తాను అని ....అహమాత్మ.... (సమస్త ప్రాణుల
హ్రిదయములయందు (నేనే); ఆదిత్యానామహం.... (అదితి యొక్క ద్వాదశ పుత్రులలో విష్ణువును
నేనే); వేదానాం సామవేదోస్మి....
(వేదాలలో సామ వేదాన్ని నేనే); వృక్షాలలో ఆశ్వత్త వృక్షాన్ని(నేనే); అక్షరాలలో అ
కారమును(నేనే); సర్వ ప్రాణుల ఉత్పత్తి (నేనే); అని చెప్పి..
ముప్పై ఐదవ శ్లోకంలో .... బృహత్సామ, తథా, సామ్నామ్, గాయత్రీ, ఛందసాం, అహం ; మాసానాం మార్గ శీర్షః, అహం, ఋతూనాం, కుసుమాకరః (చదవడానికి వీలుగా పద విభజన చేయ బడినది అని గ్రహించ ప్రార్ధన)
" వేదములలో సామవేదమును(నేనే); రుద్రులలో శంకరుడను(నేనే); గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామము (నేనే); ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు
(నేనే) మాసములలో "మార్గశీర్ష" మాసము (నేనే); ఋతువులలో వసంత ఋతువునూ(నేనే)" అని వివరిస్తాడు.
అట్లే ఈమాసములో ఆచరించబడు
ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.
శుక్లే మార్గశిరే పక్షే
యోషిత్ భర్తురనుజ్ఞయా!
ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!!
ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు. ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక వశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను.
వివాహిత యువతి క్రొత్తగా
కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున
పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని
భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము
కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస
శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార
ప్రాయముగాను చెప్పబడినది.
అంతేకాక ఈమాసముల కలువపూలతో శివుని
అర్చించిన అది మహాఫలమునొసగును.
మృగశిరా నక్షత్రంతో కూడిన
పౌర్ణమి గల మాసం మార్గశీర్షం.
మాసానాం మార్గశీర్షోహం అని
శ్రీ కృష్ణ పరమాత్మా చే చెప్పబడ్డది అంటేనే
ఈ మాసము ఎంత వైసిస్ట్యతను సంతరించు
కొన్నదో మనకు అర్ధం అవుతుంది. కాబట్టి ఈ
నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని, ఈ మాసంలో సదా ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని
పఠిస్తే మోక్ష ప్రాప్తికి హేతువని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన
మార్గశిరం లక్ష్మీదేవికి కూడా (నిత్యానపాయిని కదా) ప్రీతికరం కాబట్టి, మన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈ మాసంలో వచ్చే గురువారాల్లో ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ భక్తితో ఆచరిస్తారు.
శ్రీ మార్గశిర మహా లక్ష్మీ వ్రతము --- ఇక్కడ క్లిక్ చేయండి!!
శ్రీ మార్గశిర మహా లక్ష్మీ వ్రతము --- ఇక్కడ క్లిక్ చేయండి!!
తెలుగు మాసాలలో తొమ్మిదవది
అయిన మార్గశిర మాసంలో వచ్చే ముఖ్య తిథులు, వివరాలు పరిశీలించి
ఆచరిద్దాం.
మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందన్నారు.
మార్గశిర శుద్ధ పాడ్యమి కధ --- ఇక్కడ క్లిక్ చేయండి!!
మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందన్నారు.
మార్గశిర శుద్ధ పాడ్యమి కధ --- ఇక్కడ క్లిక్ చేయండి!!
తదియనాడు ఉమామహేశ్వర వ్రతం,
అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు.
చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు.
పంచమి : ఇది నాగపంచమిగా
దక్షిణాదిన ప్రసిద్ధికెక్కింది. ఈనాడు నాగపూజ చేయాలని స్మృతి కౌస్తుభం చెబుతోంది.
శ్రీ పంచమి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
మార్గశిర శుద్ధ షష్ఠి : మన
పంచాగకర్తలు సుబ్బారాయుడి షష్ఠిగా పేర్కొన్నారు. ద్రావిడ దేశంలో దీన్ని స్కందషష్ఠి అంటారు.
సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు పూజిస్తారు. ఇది ఉభయ గోదావరి ప్రాంతంలో రైతులకు పెద్ద
పండుగ. ఈ రోజున చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలను కూడా చేస్తారు.
సకల చరాచర జీవకోటికి
చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తి, వృచ్చిక రాసిలోంచి
ధనుర్రాసిలోకి ప్రవేసించేది ఈ మాసంలోనే.
అప్పటినుంచి మేష సంక్రమణం (సంక్రాంతి పండగ) వరకు ఈ నెల రోజులు ధనుర్మాసం గా
వ్యవహరిస్తాము. ఈ మాసంలో
"తిరుప్పావై" రోజుకొక్క పాశురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోను
చేస్తారు. గోదా దేవిని (సాక్షాత్తు
లక్ష్మీదేవి) పూజిస్తారు. తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యెక పూజలతో వైష్ణవ ఆలయాలు చాల సందడిగా ఉండే మాసం
మార్గశిర మాసం. డిసెంబరు నెల పదహారవ తేది శుక్రవారం తెల్లవారుజామున (తెల్లారితే శనివారం
పదిహేడవ తేది అనగా) ధనుర్మాస
ప్రవేశం గా పంచాంగ కర్తల నిర్ణయం. జనవరి
నెల పదిహేనవ తేది ఆదివారం నుంచి సూర్యనారాయణ మూర్తి మకరంలో ప్రవేసిస్తున్నాడు
కాబట్టి మకరసంక్రమానం (సంక్రాంతి పండగ).
ఉత్తరాయణ పుణ్య కాల ప్రారంభం.
ధనుర్మాసం గా పవిత్రమైన ఈ మాసంలో
తెల్లవారుజ్హామునే ఇళ్ళముందు కలాపి జల్లి చక్కని ముగ్గులతో (రంగవల్లులతో), కన్నె పిల్లలు పెట్టె గొబ్బెమ్మలతో వీధులన్నీ కళ కళ లాడుతూ ఉంటాయి.
మార్గశిర శుద్ధ సప్తమి
: ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ
స్వామికి ప్రీతి అయిన సప్తమి నాడు "ఆదిత్య (సూర్య)" ఆరాధన చేయాలని నీలమత పురాణంలో పేర్కొనబడింది.
మార్గశిర శుద్ధ అష్టమి : మన
తెలుగునాట కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఈనాడు కాలభైరవ పూజచేయాలని వ్రత
గ్రంథాలు చెబుతున్నాయి.
మార్గశిర శుద్ధ ఏకాదశి :
ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి
కులుగుతుందని చెబుతారు.
అందుకే, దీనిని
మోక్షదైకాదశి లేదా సౌఖ్యదా ఏకాదశి
గా ఏకాదశి వ్రతం ఆచరిస్తారు.
పూర్వం వైఖానసుడు అని ఒకరాజు. అతనికి
ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు
అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత
ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి
కావడం చేత దీనికి మోక్షదైకాదశి అని పేరు వచ్చింది.
ఏకాదశి తిథిలన్నింటిలోకీ
మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. శుక్లపక్ష ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉంది.
కురుక్షేత్రంలో తాత తండ్రులనూ, బంధుగణాల్నీ చూసి
అస్తస్రన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసిందీ
రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును "గీతాజయంతి" గా
వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని భక్తీ శ్రద్ధ
లతో పూజించి, గీతా పారాయణ చేయడం
నిర్దేసించబడింది.
మార్గశిర శుద్ధ ద్వాదశి
: ఈ భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు,
మార్గశిర సుద్ధ ద్వాదశి నాడు "అరుణోదయ
(సూర్యోదయ)" సమయంలో తిరుమల కొండపై గల స్వామీ పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయని
పురాణ ప్రమాణం. అందుకే, స్వామి పుష్కరిణి
"తీర్థ దినం" గా పూజిస్తారు.
మార్గశిర శుద్ధ త్రయోదశి
: హనుమద్ వ్రతం కల్పోక్తం గా చేస్తారు. అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం కుడా ఆచరిస్తారు.
మార్గశిర శుద్ధ చతుర్దశి
: చాంద్రాయణ వ్రతం ఆరంభ తిధి
చతుర్దశి. ఈనాడు రాత్రి వరకు భోజనం
చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి.
మార్గశిర శుద్ధ పూర్ణిమ
: చంద్ర ఆరాధన చేయాలనీ నీలమత పురాణం
వివరిస్తోంది. మన ప్రాంతంలో దీనిని కోరల పున్నమి గా వ్యవహరిస్తారు. త్రిమూర్తి స్వరూపుడైన "దత్తాత్రేయ
స్వామి" జన్మించిన రోజుగా " దత్త జయంతి " జరుపుకుంటాం. దత్త సాంప్రదాయ రీతిలో దత్తాత్రేయుని పూజలు,
దత్త చరిత్ర పారాయణం, దత్త అవతారం గా భావించే శ్రీ సాయి బాబా ఆరాధన, సాయి సత్చరిత్ర
పారాయణం జరుపుకోవడం చెప్పబడి ఉంది.
మార్గశిర శుద్ధ పాడ్యమి : తెలవారకముందే దీపారాధన చేయటం వలన కార్తీకమాసము పూర్తిగా చేయలేని వారు , సగమే చేసినవారు , కార్తీక మాసం పాతిన్చాలేనివాలు , కొన్ని రోజులు చేసినవారు పూర్తిగా చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాసం పూర్తిగా చేసినవారికి వ్రాత సమాప్తి అవుతుంది.
తెలవరుఝామున స్నానం చేయటం , నది స్నానం చేయటం . ఆవునేతిలో నానబెటిన బొడ్డు 32 ఒత్తులు అరటి దొంనలో కానీ డొప్పలో తెలవారకముందే వదలాలి.
సిటీ లో వుండెవాలు ఒక తొట్టె/పాత్ర లో నీలు పోసి గంగా దేవి ని ఆవాహన చేసి అరటి డొప్పలో దీపం వదిలి, ప్రదక్షిణ చేయటం వలన కూడా నది స్నానం చేసి దీపాలు వదలడం వలన ఎంత ఫలితం వస్తునో అంతే ఫలితం వస్తుంది.
మార్గశిర శుద్ధ పాడ్యమి కధ: ఒక చాకలి ముసలి ఆవిడకు అయిదుగురు కోడళ్ళు ఉన్నారట .ఆమె ఆశ్వ యుజ బహుళ అమావాశ్య నుంచి కార్తీక బహుళ అమావాశ్య వరకు తెల్ల వారు ఝామునే లేచి ,ఏటి లో చన్నీటి స్నానం చేసి దీపం పెట్టు కొనేది .ఇలా ఒక నెల గడి చిన తర్వాత కార్తీక అమావాశ్య నాడు చిన్న కోడలు ”పోలి”ని ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడళ్ళను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళింది .చిన్న కోడలు పెరుగు చిలికి వెన్న తీసి ,కవ్వానికి అంటిన వెన్న తీసి ,పత్తి చెట్టు కింద రాలిన పత్తి తో వత్తి చేసి ,ప్రమిదలో పెట్టి ,శుభ్రం గా నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించింది .అత్త గారు వచ్చి తిట్టు తుందనే భయం తో ఆ దీపం కనపడ కుండా దానిపై చాకలి బాన బోర్లించింది .దేవతలు ఆమె భక్తికి సంతోషించి ,దివ్య విమానాన్ని తెచ్చి ,ఆమెను బొందె తో కైలాసానికి తీసుకు వెళ్ళారు .వూళ్ళో వున్న వారంతా ”,చాకలి పోలి స్వర్గానికి వెడుతోంది ”అను కుంటు వింత గా చూశారు .విమానం బాగా క్రిందు గా పోతూ వుండటం తో ఆమె కాళ్ళు పట్టు కోని వూరి జనం కూడా ఆమెతో స్వర్గానికి వెళ్తున్నారు .విష్ణు దూతలు ”ఈ పోలి అధిక భక్తీ తో జ్యోతిని వెలి గించింది .కనుక స్వర్గానికి తీసుకొని వెళ్తున్నాం .మీకు ఆ అదృష్టం లేదు ”అని వాళ్ళను కిందకు తోసే శారు .పోలి శరీరం తో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ము రాలు .అందుకే ఆమె ను తలచు కుంటు కార్తీక అమావాశ్య తెల్ల వారుజ్హామున నది ఒడ్డున దీపాలు వెలిగించి ఆమె ను గుర్తు చేసు కొంటు ,ఆమె కధను చెప్పు కొంటు ,నీటి లో దీపాలు వదిలి పెడ తారు స్త్రీలు అంతా .స్త్రీలు అందరు ఈ కధ చెప్పు కోని అక్షంతలు నెత్తినా వేసుకొని ఇంటికి తిరిగి వస్తారు .అరటి దొప్ప లలో ఆవు నీతి దీపాలు వెలిగించి నీటి లో వదులు తారు .అదీ పోలి స్వర్గానికి పోవటం అంటే .ఇందు లో రెండు ముఖ్య విషయాలున్నాయి .ఒకటి భక్తికి కులం అడ్డు రాదు .అందుకే అందరు అన్ని కులాల స్త్రీలు ”పోలి తల్లి ”ని గుర్తుంచు కోని దీపాలు పెట్టి సాగ నమ్పటం .రెండోది కార్తీక దీపానికి అంత ప్రాముఖ్యత వుంది అని తెలియ జేయటం .నిశ్చల భక్తీ తో చేసింది ఏదైనా పర మేశ్వరుడు మెచ్సుతాడు .