కార్తీక స్నానాలు ఎప్పటినుంచి ఎలా ప్రారంబించాలి ?

"నిర్ణయ సింధు " లో  అస్వీజ  పూర్ణిమ నుంచి కర్తీక పూర్ణిమ వరకు స్నానాలు చేస్తారు . అమావాస్య నుంచి అమావస్య వరుకు ఒక నెలగా మనం లెక్క చూసుకుంటాం అయితే వీరు కర్తీక మాసం ఒకటే చూసుకోరు . ఉత్తరాదిని మాత్రం ఆస్విజ పూర్ణిమ నుంచి పూర్ణిమ వరుకు ఒక మాసం అని చూసుకుంటారు . ఈ విధంగా చేసే వారు లేదా కర్తీక మాసం స్నానాలు మాత్రమే చేయాలి అనుకునే వారు ఎపటినుంచి ప్రారంబించాలి. 

అస్వీజ సుద్ధ దశమి (విజయ దశమి ) , లేదా ఏకాదశి నుంచి కానీ , లేదా అస్విజ సుద్ద పూర్ణిమ నుంచి - కర్తీక సుద్ధ పూర్ణిమ వరకు చేస్తారు . 

ఇంకొంత మంది 40 రోజులు చేయాలి అని చెప్పి అస్వీజ పూర్ణిమ నుంచి కార్తీక అమావాస్య వరుకు చేస్తారు . 

మరికొంత మంది అమావాస్య నుంచి అమావాస్య వరుకు మాసాని లేక్కపెడుతువుంటారు . అలంటి వాలు కానీ లేదా నిత్యయం నది స్నానం నియమమ గ చేయాలి అనుకునే వాలు దీపావళి తరువాత వచ్చే కర్తీక సుద్ధ పాడ్యమి నుంచి - కర్తీక బహుళ అమావాస్య వరుకు చేయాలి . 
ఒక వేల నెల రోజులు చేయలేకపోతే ఆశ్వీజ సుద్ధ దసిమి రోజు కానీ,  ఏకాదశి రోజున కానీ , పూర్ణిమ రోజు కానీ ప్రారంబించా వచ్చు . లేదా కర్తీక సుద్ద పాడ్యమి నుంచి అమావాస్య వరుకు కూడా ప్రారంబించా వచ్చు . 

కార్తీక స్నానం ఎక్కడ ? ఎన్ని గంటల లోపు చేయాలి ? ఎక్కడ చేయాలి ?

కృత్రిక నక్షత్రం వెళ్ళిపోక ముందు / నక్షత్రాలు వెళ్ళిపోక ముందు చేయాలి. పుణ్య నదులలో ఎక్కడ చేసిన పుణ్యమే . రెండు నదులు సంగమ్మ లో చేస్తే విశేషం . నది దగర స్నానం చేసిన తరువాత నది దగరే దీపం పెట్టుకోవాలి . ఒక వేల ఇంటి దగర అయిహ్తే తులసి కోట దగర కూడా దీపం పెట్టాలి . ఈ కార్తీక మాసం లో గోవు పాదం మునిగేంత నీరు ఉన్న్న అందులో గంగ దేవి ఉంటుంది.

కార్తీక మాసం లో ఏ నీలతొ స్నానం చేయాలి ?

భూమిని ఆశ్రయించి ఉన్న(భావి , నది , సముద్రం ) నీరు స్నానానికి అనుకూలంగా గానే ఉంటుంది . ఈ నీటితో స్నానం చేయ గలిగితే మంచిది . కానీ నగరాలో , విదేశాలలో ఉండే వారికీ ఇది సాద్యం కాదు . సాద్యం కాదు అని కార్తీక మాసం చేయడం మనేయకుడదు . 

నగరాల్లో సంపులో ఉన్న నీరు అసలే ఛల్ల గ ఉంటాయి . ఈ నీటిని భూమి మీద ఉండే నీరు ఎంత వేడిగా ఉంటాయో అంత వరుకు గోరు వెచ్చ గ వేడి చేసుకుని గంగా నామని చేపిస్తూ స్నానం చేయడం వలన మంచి ఫలితం గలుగుతుంది . 

నది స్నానానికి నియమాలు ఏంటి ?

నదిలో ఎప్పుడు పళ్ళు తోమకుడదు . మంచం మీద నుంచి లేచి వెంటనే నదిలో స్నానానికి వెళ్ళకూడదు.

ఇంటి దగర కాలకృత్యాలు తీర్చుకుని , పళ్ళు తోముకుని , స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని , అప్పుడు నది స్నానానికి వెళ్ళాలి . స్నానతరం నది కి నమస్కరించి ఒడ్డున దీపం పెట్టి , నదిలో కూడా దీపం వదలాలి . నదిలో 200 అడుగుల దూరమ్ వరుకు ఎవరు మల మూత్ర విసర్జన చేయకూడదు , ఉమ్ము వేయకూడదు . 

షాంపూ ల తో తల స్నానం చేయకూడదు , బట్టలు ఉతకకుడదు . ఇలా నదిని కలుషితం చేయడం వలన పక్కన ఉన్న వారు లేదా ఆహ నీటితోనే సూర్యునికి అర్ఘ్యం ఎవటం వలన మనం పాపం సంపదిస్తునమ ? లేదా పుణ్యం సంపదిస్తునమ? నదిని పవిత్రం గ వుంటుంది , దయ చేసి కలుషితం చేయకండి . 

పంచ గంగా తీర్థమ్ మద్యలోకి వెళ్లి నీరు తీసుకువస్తే అ నీరు 30 సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది. హరిద్వార్ నుంచి స్నానాలు చేయని స్థలం అంటే కొంచం మద్యలోకి వెళ్లి నీరు తీసుకువచ్చి దాస్తే అది 100 సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది . 
ఇంత పవిత్రం గ ఉండే నదిని మనం ఎంత పాడుచేస్తునం?

నిద్ర ఒంటితో ఎప్పుడు స్నానానికి వెళ్ళకూడదు . నిద్ర పోయినప్పుడు మన సరీరని ఆశ్రయించి స్వేదం ఉంటుంది . దానితో స్నానం చేస్తే మహా పాపం .దయ చేసి చదువుకున్న వారు అంత మన సంస్కృతిని మన దేసాని మనమే కాపాడుకోవాలి . 

కార్తీక మాసం లో నే కాదు నిత్యం , ఎల్లపుడు స్నానం చేసేటప్పుడు గంగా దేవి ని స్మరించుకోవడం వలన గంగ దేవి కృప కలుగుతుంది .