శ్రీ ఆర్యాద్విశతి – 3వ భాగము
II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 3వ భాగము II(శ్రీ లలితాస్తవరత్నమ్)
వప్రద్వయా న్తరోర్వ్యాం
వటుకై ర్వివిధైశ్చ యోగినీ బృన్దైః I
సతతం సమర్చితాయా
సఙ్కర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జమ్ II 41 II
తాపస యోజన దూరే
తస్య సముత్తుఙ్గ గోపురోపేతే I
వాఞ్ఛాపూర్త్యై భవతాద్
వజ్రమణీ నికర నిర్మితో వప్రః II 42 II
జవరణ ద్వితయా న్తరతో
వాసజుషో వివిధ మధురసాస్వాదాః I
రమ్భాది విబుధ వేశ్యా
రచయన్తు మహాన్త మస్మదానన్దమ్ II 43 II
తత్రసదా ప్రవహన్తీ
తటినీ వజ్రాభిధా చిరం జీయాత్ I
చటులోర్మి ఝాట నృత్యత్
కలహంసీ కుల కలక్వణిత హృష్టా II 44 II
రోధసి తస్యా రుచిరే
వజ్రేశీ జయతి వజ్ర భూషాఢ్యా I
వజ్ర ప్రదాన తోషిత
వజ్రిముఖ త్రిదశ వినుత చారిత్రా II 45 II
తస్యోదీచ్యాం హరితి
స్తబకిత సుషమావలీఢ వియదన్తః I
వైఢూర్య రత్న రచితో
వైమల్యం దిశతు చేతసో వరణః II 46 II
అధిమధ్య మేతయోర
ప్యమ్బా చరణాబ్జ లమ్బిత స్వాన్తాన్ I
కర్కోటకాది నాగాన్
కలయామః కిఞ్చి బలిముఖాన్ దనుజాన్ II 47 II
గన్ధవహ సఙ్ఖ్య యోజన
దూరే గగనాధ్వ జాఙ్ఘిక స్తస్య I
వాసవమణి ప్రణీతో
వరుణో బహుళయతు వైదుషీం విశదామ్ II 48 II
మధ్యక్షోణ్యా మముయో
ర్మాహేన్ద్ర నీలాత్మకాని చ సరాంసి I
శాతోదరీ సహాయాన్
భూపాలానపి పునః పునః ప్రణుమః II 49 II
ఆశుగ యోజన దూరే
తస్యోర్ధ్వం కాన్తి ధవళిత దిగన్తః I
ముక్త విరచిత గాత్రో
ముహురస్మాకం ముదే భవతు వప్రః II 50 II
అధివప్రద్వయ మధ్యం-
పూర్వాస్యాం దిశి పురన్దరః శ్రీమాన్ I
అభ్రమ విటాధిరూఢో
విభ్రమ మస్మాక మనిశ మాతనుతాత్ II 51 II
తత్కోణే వ్యజన – సృక్
తోమర-పాత్ర-స్రువాన్న-శక్తిధరః I
స్వాహా స్వధా సమేత
స్సుఖయతు మాం హవ్యవాహన స్సుచిరమ్ II 52 II
దక్షిణ దిగ న్తరాళే
దణ్డధరో నీల నీరద చ్ఛాయః I
త్రిపురా పదాబ్జ భక్తః
తరయతు మమ నిఖిల మంహసో నికరమ్ II 53 II
తస్యైవ పశ్చిమాయాం
దిశి దళితేన్దేవర ప్రభా శ్యామః I
ఖేటాసి పట్టధారీ
ఖేదా నపనయతు యాతుధానో మే II 54 II
తస్మాదుత్తర భాగే
ధవళాఙ్గో విపుల ఝష వరారూఢః I
పాశాయుధాత్త పాణిః
పాశీ విదలయతు పాప జాలాని II 55 II
వన్దే తదు త్తర హరిత్కోణే
వాయుం చమూరు వర వహమ్ I
కోరకిత తత్త్వబోధాన్
గోరక్ష ప్రముఖ యోగినోఽపి ముహుః II 56 II
తరుణీ రిడా ప్రధానా
స్తిస్రో వాతస్య తత్ర కృతవాసాః I
ప్రత్యగ్ర కాపిశాయన
పాన పరిభ్రాన్త లోచనాః కలయే II 57 II
తల్లోక పూర్వభాగే
ధనదం ధ్యాయామి సేవధి కులేశమ్ I
అపి మణిభద్ర ముఖ్యా
నమ్బా చరణాబ్జ లమ్బినో యక్షాన్ II 58 II
తస్యైవ పూర్వ సీమని
తపనీయారచిత గోపురే నగరే I
కాత్యాయనీ సహాయం
కలయే శీతాంశు ఖణ్డ చూడాలమ్ II 59 II
తత్పుర షోడశవర్ణ
స్థలభాజ స్తరుణ చన్ద్ర చూడాలాన్ I
రుద్రాధ్యాయే పఠితాన్
రుద్రాణీ సహచరాన్ భజే రుద్రాన్ II 60 II