మహాభారత -18 అధ్యాయాలు

 శ్రీ కృష్ణుడు మహాభారత యుద్దము సమయములో, అర్జునునిలో కలిగిన సంసయాలను తీర్చడానికి బోదించినదే ఈ భగవద్గీత. ఆయన బోదించిన దానిని మనకు 18 అధ్యాయాల రూపంలో వివరించినారు.
18 అధ్యాయాలు :
1.            అర్జునవిషాదయోగః
2.            సాంఖ్యయోగః
3.            కర్మయోగః
4.            జ్ఞానకర్మసన్యాసయోగః
5.            సన్యాసయోగః
6.            ధ్యానయోగః
7.            జ్ఞానవిజ్ఞానయోగః
8.            అక్షరబ్రహ్మయోగః
9.            రాజవిద్యారాజగుహ్యయోగః
10.         విభూతియోగః
11.         విశ్వరరూపదర్శనాయోగః
12.         భక్తియోగః
13.         క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగయోగః
14.         గుణత్రయవిభాగయోగః
15.         పురుషోత్తమయోగః
16.         దైవాసురసంపద్విభాగయోగః
17.         శ్రద్ధాత్రయవిభాగాయోగః
18.         మోక్షసన్న్యాసయోగః

మొదట సృష్టి ఆవిర్భవించిన సమయంలో శ్రీ మహావిష్ణు మూర్తి సృష్టి కర్త అయిన బ్రహ్మకు ప్రబోదించాడు. బ్రహ్మ దేవుడు వాటిని సమస్త జగతుకు అందజేశాడు. కానీ అవి వ్రాత పూర్వకం ఆయనది మాత్రం శ్రుతి (అంటే వినడం ద్వార) అదారంగా వ్రాయబడినాయి అని మన పుర్వికులే ఈ విషయాన్ని తెలియజేసినారు. ఆ విదంగా వేదాలు మరియు ఉపనిషతులు వేదం వేదంగ పండితుల ద్వార మనకు సుపరిచితమయ్యాయి. కాని ఒక భగవద్గీత మాత్రం ఆ దేవదేవుడైన శ్రీ మహా విష్ణు మూర్తే లోకపాలకుడు మరియు లోకరక్షకుడైన ఆ నారాయణుడే స్వయంగా లోకరక్షనార్దం, ధర్మాన్ని నిలబెట్టడానికి తనే శ్రీ కృష్ణడు గా అవతారం ఎత్తి అదే సారాంశాన్ని తను మరల అవివేకులై అజ్ఞానందకారంలో వున్న తన లోకానికి తనే
స్వయంగా వచ్చి ప్రబోదించిన బోధనే ఈ భగవద్గీత.

యదాయదాహిధర్మస్య, గ్లానిర్భవతిభారత
అభ్యుత్థానమధర్మస్య, తదాత్మానంసృజామ్యహమ్
పరిత్రాణాయసాధునాం, వినాశాయచాదుష్క్త్రుతాం
ధర్మసంస్తాపనార్తాయా, సంభవామియుగేయుగే ||

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వ్రుద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ , దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణ కొఱకు ప్రతియుగామునా అవతారము దాల్చుచున్నాను.

లోకేస్మిన్ద్వివిధానిష్టా, పురాప్రోక్తామయానఘ
జ్ఞానయోగెనసాంఖ్యానం, కర్మయోగేనయోగినాం || (భగవద్గీత)


అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను , చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగం చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడింది