‘శివ శివ శంకర’ ‘హరహర శంకర’ ‘జయజయ శంకర’
‘శివ ధర్శనం
ముక్తిదాయకం -శివనామం కల్యాణకరం. ఆయన పేరులోనే వుంది ఆ గుణం. ‘శం’ మేలు, ‘కర’ కూర్చునువాడు. సమస్త లోకాలకు ఆది
శంక్తిపరాశక్తి అయిన పార్వతీదేవి, దుర్గగా, చండిగా, కాత్యాయినిగా, కాళిగా, సరస్వతిగా, త్రిపురసుందరిగా, వేరువేరు రూపాలతో వేర్వేరు శక్తి ప్రభాసగా
పూజలందుకుంటోంది. భక్త సులభుడు కనుకనే ఆ స్వామిని హృదయపు గుళ్ళలోను, బయట దేవాలయాలలోను ప్రతిష్ఠించుకున్నారు.
విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక
ప్రియుడు. ‘‘మాఘ బహుళ
చతుర్థశి రోజున మహాశివరాత్రి వచ్చును. ఆదినమన నుపవాసముండి, శివునకు అభిషేకము లోనర్పవలయును లింగోధ్భవకాలము
వఱకును అభిషేక పూజాదులొనర్చి అప్పుడు నివేదన చేయవలయును తెల్లవారు వఱకు జాగరణ
మొనర్ప వలయును’’... ఇది శాస్త్రవిధి.
పుష్యమాసంలో వచ్చే భోగి, సంక్రాంతి
పండుగలలో ధనుర్యాస వ్రతాచరణం గోదా శ్రీరంగనాథుల కల్యాణ మహోత్సవాలను జరుపుకున్న
కొద్దిరోజులకే మహాశివరాత్రి పర్వదినంతో భక్తి ప్రపత్తులో మునిగిపోతాం! మనదేశంలోని 18
పీఠాలలో మహాశివరాత్రి
పర్వదినంనాడు మహా రుద్రాభిషేకాలు, పూజలు, దీక్షలు జరుగుతాయి. ఆ శివరాత్రి పర్వదినంనాడు
స్వామి లింగోద్భవుడై భక్తులను అనుగ్రహిస్తాడు. త్ర్యంబకం, ఉజ్జయినీ, శ్రీశైలం వంటి మహా పుణ్య స్థలాల్లో శివనామం
విన్నా, ధర్శించినా
ముక్తి లభిస్తుందని చెబుతారు. వారణాశిలో అన్నపూర్ణా విశ్వేశ్వరుల దర్శనాన్ని
మించింది లేదంటారు. శ్రీశైల శిఖర దర్శనం మాత్రం చేతనే ముక్తి కలుగుతుందని చెప్పటం
వలన క్షేత్రం ఎంత విశిష్టమైనదో తెలుస్తుంది. శివరాత్రి మాహత్యం గురించి సంస్కృతంలో,
తెలుగులో ఎన్నోకావ్యాలు
వచ్చాయి. కాల స్వరూపుడైన శివుడు వెలసిన దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోనివారికి
కాలదోషం కలుగుతుందని పెద్దలమాట. మహాకవి నిరంతరం ఈశ్వరార్చన కళాశీలుడు, శైవ కవి, కవిసార్వభౌముడైన శ్రీనాథుడు కాశీ ఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహత్యం వంటి కావ్యాలలో శివతత్వాన్ని
ఈశ్వరవిలాసాన్ని అద్భుతంగా వర్ణించాడు. శివరూపం, విష్ణురూపమైనా భిన్నత్వంలో ఏకత్వం రూపు
దిద్దుకున్న శక్తికి మారు రూపమే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, రావణ వధానంతరం మానవ పశ్చాత్తపంగా సముద్రతీరంలో ‘శివ లింగం’ స్థాపించి త్రికరణశుద్దిగా పూజించాడు. అదే నేడు
రామేశ్వరంగా ప్రసిద్ధి పొందింది. కాలానుగతంగా ఎందరో రారాజులు, సామంతులు, ప్రధానులు, సేనానులు ధార్మిక చింతా పరాయుణులై అనేక చోట్ల
శివాలయాలను,శక్తి పీఠాలను
స్థాపించారు. నేటికి చరిత్ర ప్రసిద్ధమైన పీఠాలుగా వెలుగుతున్నాయి. ఉత్తర భారతానికే
మకుటాయమయిన హిమాలయ పర్వత సానువుల మధ్య కైలాస పర్వత శ్వేత సౌధం కనిపిస్తుంది.
సాక్షాత్తూ పరమేశ్వరుడు ప్రమధ గణాలతో వేంచేసి జగ్తత్తును కాపాడుతున్నాడు.
ఉమాసహితుడైన నీలకంఠేశ్వరుడు నిరంతరం కృఫాగంగను ప్రసరింప చేసి ఆ గంగా జలామృతాన్ని
అందించే మహిమాన్వితమైన హిమాలయమది. ఆ భక్తవశంకరుడైన శంకరుడు లింగరూపి. ఇతర
విగ్రహాలకున్నట్లుగా కరచరణ, వజ్రవైఢుర్యాధ్యలంకారాలు
లేని శివుడు గంగాప్రియుడు. ఆయన్ని అభిషేకిస్తే చాలు వరాలు జాలు కురిపిస్తాడు.
అందుకే ఆయనను బోళా శంకరుడని పిలస్తాం.