అష్టసిద్ధులు
భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఈ ఎనిమిది సిద్దులను అష్ట సిద్దులు అంటారు. అవి అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.
1. అణిమ : చిన్నరూపము దాల్చుట
అణురూప ప్రాణులందు పరమాణురూపముగానుండుట(సూక్ష్మరూపము) సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మిఅతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.
2. మహిమ : పెద్ద రూపము దాల్చుట
(ఈ రెండు సిద్దులను, శ్రీ మద్రామాయణ సుందర కాండలో హనుమంతునిలో చుడగలము) విరాడ్రూపముగానుండుట(పెద్దరూపమునుపొందుట) భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీనికారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు
3. గరిమ : చాల బరువగుట
(తృణా వర్తుని జంపు శ్రీ కృష్ణునిలో చూతుము) బ్రహ్మాండాదులకంటే బరువుగానుండుట ; ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగాచేయగలరు.
4. లఘిమ : తేలికయగుట
(నీటి పైన నడచుట, ఆకాశ మార్గమున పోవుట) ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు
5. ప్రాప్తి : అనుకొన్న స్థాయికి చేరుట. ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండికూడా సృజించుకోగలరు
6. ప్రాకామ్యము : కోరినది పొందుట. అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములోఉంటాయి.
7. ఈశత్వం : పంచ భూతాల పై అధికారము సంపాదించుట (ప్రహ్లాదునివలె). ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగినఅధికారం వస్తుంది
8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి. ఇంద్రియములను లోబరచుకొని యిష్టార్ధ సిద్దినొందుట.
ఈ యెనిమిదింటిని అష్ట సిద్ధులు అందురు. ఎవ్వరీ అష్ట సిద్దులను యోగ మార్గమున పొందగలుగుదురో వారు బ్రహ్మ స్వరూపమునుపొందగలరు. ఐతే ఈ సిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించ బడినది.