• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

శ్రీ కృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శ్రీ కృష్ణ



ఇంకా చదవండి »

గీతా సారాంశం



ఇంకా చదవండి »

వైద్యుడు నారాయణుడైన శ్రీహరి

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే
షధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః!!

ఆ శ్లోకం పూర్తి పాఠమిది. "కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలం.  వైద్యుడు నారాయణుడైన శ్రీహరి అని అర్థం.

శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాంతర పాప పంకిలాన్ని శుద్ధిచేసుకోవడం ముఖ్యకర్తవ్యం. అందుకు పవిత్ర గంగాజలపానం, శ్రీహరి స్మరణ ముఖ్యం. ఈ రెండే జీవన సార్థకతలు. జన్మకి సాఫల్యాలు అని చెప్పే బోధన ఇది. అంతేకాక - గంగాస్మరణ, నారాయన స్మరణ శక్తిమంతమైనవి. ఈ శ్లోకం చదివినవారికి వైద్యునిలోనున్న ప్రతిభారూపమైన నారాయణ శక్తి అనుకూలిస్తుంది. సరియైన స్ఫురణతో శ్రీహరి వైద్యుని ప్రేరేపిస్తాడు. వైద్యునిలోని వైద్యశక్తి పరమేశ్వరుడైన శ్రీహరి రూపమే కదా! హరిస్మరణతో అది మనల్ని బాగు చేసేలా ప్రేరేపించబడుతుంది. అలాగే గంగాస్మరణతో ఔషధం పవిత్రమై, ప్రభావశాలి అవుతుంది. పరానికీ, ఇహానికీ పనికివచ్చే ప్రయోజనాలను ఇచ్చే పరంపరాగత శ్లోకమిది.

ఇంకా చదవండి »

గీతలో కేశవనామాలు


సర్వశాస్త్రమయీ గీతాసకల శాస్త్రసారమే గీత అని వ్యాసుడు మహాభారతంలోని భీష్మపర్వంలో పేర్కొన్నాడు. ఎందుకంటే శాశ్రాలన్నీ వేదాలనుండి ఏర్పడ్డాయి. వేదాలు బ్రహ్మముఖం నుండి వెలువడ్డాయి. అటువంటి బ్రహ్మ పద్మనాభుడిగా పిలువబడే భగవంతుని నాభి కమలం నుంచి ప్రభవించాడు. ఈ రీతిని గమనిస్తే భగవంతునికి, శాస్త్రానికి మధ్య చాలా అంతరం ఉండి. కాని భగవద్గీత విషయంలో భగవద్గీతను శ్రవణ, కీర్తన, పఠనాదులు ద్వారా మననం చేస్తూ వుంటే ఇతర శాస్త్రాలతో పని లేదు. ఎందు చేతనంటే అది సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ విష్ణుభగవానుని ముఖ కమలం నుండి ప్రభవించినది అని వ్యాసుడు పేర్కొన్నాడు.

గీత ఆ భగవానుని కంటె శ్రేష్ఠమైనదని చెప్పినా ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. భగవానుడే స్వయంగా నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీతయే నా నివాసం. ముల్లోకాలను పాలించటంలోనే గీతా జ్ఞానమే నాకు పరమ సాధనముఅని పలికాడు. అంతేకాక అంతర్యామియైన నా యందు లగ్నమైన మనస్సు ద్వారా సమస్త కర్మలను నాకు సమర్పించి ఆశారహితుడై, మమతారహితుడై కర్మనాచరిస్తే (ఇది భగవంతుని మతం) వారు కర్మల నుండి ముక్తులై మోక్షాన్ని నిస్సందేహంగా పొందుతారని భగవంతుడు గీతలో ప్రకటించాడు.


మహాభారతంలో వ్యాసుడు రచించిన ఒక నవలనీ, కురుక్షేత్ర సంగ్రామం అసలు జరగలేదని, కృష్ణుడు హి-మాన్లాంటి కల్పితపాత్ర అని నాస్తికులు కొట్టి పారేస్తారు. కాని అమెరికాకు చెందిన నాసా శాస్రవేత్తలు కృష్ణుడు క్రీ.పూ.3228, జూలై 21వ తేదిన జన్మించి, క్రీ.పూ.3102, ఫిభ్రవరి 17వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు మరణించినట్లు నక్షత్ర గ్రహకూటమి ఆధారంగా లెక్కకట్టి నిర్థారించారు. ఆయన నిర్యాణం చెందిన రోజు నవగ్రహాలు, మేషరాశి ఒకే రేఖపై నిలిచాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ద్వారకా (గుజరాత్) సముద్రం అడుగున లభించిన కృష్ణుడు పాలించిన ద్వారకాపట్టణం అవశేషాలు పురావస్తుశాఖ కనుగొని, క్రుషుడు ద్వారకా నగరాన్ని పాలించినట్లు చారిత్రిక ఆధారాలతో నిరూపించింది. మహాభారత సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసిన సమయంలో కృష్ణుని వయస్సు 90 సం||రాలని కూడా నిర్ధారించారు. అంటే కురుక్షేత్ర యుద్ధం తరువాత సుమారు 35 సం||రాలు కృష్ణుడు ద్వారకానగరాన్ని పరిపాలించాడని అవగతమవుతోంది. దీనారాజాదాస్ అనే పరిశోధకుడు క్రీ.పూ.5 సం|| లేదా 2 సం||లో భగవద్గీత వ్రాయబడి మహాభారతంలో చేర్చబడిందని తన అభిప్రాయాన్ని తెలిపాడు. తన వాదనకు సరియైన ఋజువును ప్రతిపాదించలేకపోయాడు. వ్యాసుడు పురుషోత్తముడైన కృష్ణుని విష్ణువు యొక్క అవతారంగా భావించిసహస్రనామాలతో (విష్ణు సహస్ర నామస్తోత్రం) స్తుతించాడు. నేతి స్పీడుయుగంలో భగవదర్చనకు కేవలం కొన్ని సెకన్లు లేదా నిముశాలను కేటాయించలేని మనకు, విష్ణువు యొక్క వేయి నామాలు ఉచ్చరించడానికి సమయం చిక్కటం లేదు. అందువల్ల భగవద్గీతలో వ్యాసుడు కృష్ణుని సంబోధించిన పేర్లను స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితాన్ని పొందగాలుగుతాం. ఆ పెర్లేంతో తెలుసుకునే ముందు మహిమాన్వితమైన విష్ణునామాలను గూర్చి ప్రస్తావించు కొందాం. బ్రహ్మవైవర్త పురాణంలో విష్ణునామమహిమ విశేషంగా పేర్కొనబడింది.

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామ గోవిందం దధివామనమ్

పై పది విష్ణునామాలు భక్తితో వందసార్లు జపిస్తే మానవుడు రోగ విముక్తుడగుతాడు. లక్షసార్లు జపిస్తే మానవుడు రోగవిముక్తుడగుతాడు. లక్షసార్లు జపిస్తే బంధ విముక్తుడవుతాడు. పదిలక్షసార్లు జపిస్తే గొడ్రాలు సంతానవతి అవుతుంది. కోటిసార్లు జపిస్తే జీవన్ముక్తుడవుతాడు. బదరీనాథ్ (నారాయణక్షేత్రం)లో జపిస్తే సర్వసిద్ధులు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.

ప్రహ్లాదకృత హర్యష్టకంకూడా చాలా మహిమాన్వితమైనదే. దీనిని చదివితే దుఃఖసాగర శోషణంసముద్రం వంటి దుఃఖం కూడా ఎండిపోయి (నివారించబడి) సుఖం కల్గుతుందని, విష్ణువు యొక్క పరమపదం (వైకుంఠప్రాప్తి) లభిస్తుందని ప్రహ్లాదుడు పేర్కొన్నాడు. హరి: ఓంమహిమాన్వితమైన విష్ణువు యొక్క అతి చిన్న మంత్రం. అదేవిధంగా ఓం శ్రీంలక్ష్మీదేవి యొక్క అతి చిన్నమంత్రం. ఈ రెండింటిని కలిపి మననం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

విష్ణు షోడశ నామస్తోత్రం 
మనం అనునిత్యం చేసేపనికి విష్ణుని ఒక్కొక్క పేరుతో స్మరిస్తూ వుండాలి. కాని, సర్వకాలాల్లో మాధవుని స్మరించాలి. ప్రతి ఉదయం నిద్రలేస్తూనే స్మరించాల్సిన విష్ణునామాలు క్రింది స్తోత్రంలో వివరించబడ్డాయి.

ఔషధే చింతయేత్ విష్ణుం భొజనే చ జనార్దనం
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే
దుస్స్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూదనం

కాననేనారసింహం చపావకే జలశాయినం
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే

ప్రతీ దేవునిపూజా సంకల్పంలో చెప్పే 24 విష్ణునామాలు 
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః.

భగవద్గీతలో ప్రస్తావించిన కేశవనామాలు 
భగవద్గీతలో 18 అధ్యాయల్లో, 700 శ్లోకాల్లో వేదాంత విషయం గంభీరంగా చర్చింపబడింది.

4-7-9-12-13-15-16 అధ్యాయాల్లో కృష్ణుని ఏ పేరుతోను వ్యాసుడు సంబోధించలేదు. మిగిలిన అధ్యాయాల్లో పేర్కోన్న విష్ణు (కృష్ణ) నమాలు
1. హృషీకేశ
2. అచ్యుత
3. కృష్ణ
4. కేశవ
5. గోవింద
6. మధుసూదన
7. జనార్దన
8. మాధవ
9. వార్హ్ణే య
10. అరిసూదన
11. పూరుష
12. పురుషోత్తమ
13. పరంబ్రహ్మ
14. పరంధామ
15. ఆదిదేవ
16. అజ
17. శాశ్వతం
18. విభు
19. భూత భావనా
20. భూతేశ
21. దేవదేవ
22. జగత్పతి
23. యోగీ
24. భగవన్
25. వాసుదేవ
26. కమల పత్రాక్ష
27. పరమేశ్వర
28. ప్రభు
29. మహాయోగేశ్వర
30. హరిః
31. విశ్వేశ్వర
32. విశ్వరూపా
33. సనాతనపురుష
34. మహాత్మా
35. మహాబాహో
36. విష్ణు
37. అనంతరూప
38. అనంతవీర్య
39. యాదవ
40. జగన్నివాస
41. సహస్రబాహు
42. విశ్వమూర్తి
43. అనాది
44. లోకమహేశ్వరం

పై నామాల్లో కేవలం పన్నెండునామాలు మాత్రమే రెండు లేదా దానికంటే ఎక్కువ సార్లు పేర్కొనబడ్డాయి.


వీటిలో మహిమాన్వితమైన వాసుదేవనామంతో ఓం నమో భగవతే వాసుదేవాయఅనే ద్వాదశాక్షరీ రూపొందించబడింది. దీనిని నిత్యం జపిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కేశవనామాలను క్రమం తప్పకుండా జపిస్తే అనంతపుణ్య ఫలం దక్కడంతో పాటు మంచి జరుగుతుంది.

ఇంకా చదవండి »

శ్రీ కృష్ణ అవతార సమాప్తి

కురుక్షేత్ర సంగ్రామం అనంతరంఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ  ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని  శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.

మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.

అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో  పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. "తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి."

సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా  భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.

మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.

దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం  చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.

అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి  బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. "త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు." అని శ్రీ కృష్ణుడు తన  శరీరమును త్యజించాడు.

ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.

వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.


ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.

ఇంకా చదవండి »

ద్వారకా

192 కిలోమీటర్ల పొడవు...       192 కిలోమీటర్ల వెడల్పు..
 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..       బారులు తీరిన వీధులు.. 
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..        రాయల్‌ ప్యాలెస్‌లు.. 
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..               కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..            
క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..                  వజ్ర తోరణాలు..        సాటిలేని ఆర్కిటెక్చర్‌..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..          జగన్నాథుడి జగదేక సృష్టి.. 
క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి సిటీ   ద్వారక..

ఇప్పుడు సాగర గర్భంలో మన నాగరికత, మన సంస్కృతి , మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ ద్వారక. 

అవును, రామాయణం నిజం మహా భారతం నిజం. ద్వాపర యుగం నిజం. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం అద్భుతమైన మన నాగరికత నిజం అపూర్వమైన మన సైన్స్‌ నిజం. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ ఒక్కమాటలో చెప్పాలంటే ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా.

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక కృష్ణుడి ద్వారక విశ్వకర్మ నిర్మించిన ద్వారక.

ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది.

మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి. మధురలో కంసుడి కారాగారంలో జగద్గురువు జన్మించాడు. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు.

శ్రీకృష్ణ నిర్యాణానంతరం ద్వారకా నగరాని తనలో కలుపుకోమని గోమతి నది ని ఆదేశిస్తాడు. కాలగర్భంలో ఆనవాలే లేకుండా గోమతి నది తనలో కలిపుకొంది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది.
అదే కృష్ణావతార సమాప్తము కూడా . 

ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది. అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడిన భారతదేశ మూలాల్ని చూస్తుంటే ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు. శ్రీకృష్ణుడు ఆదేశానుసారం విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది అని వినికిడి.

ద్వారకలో తొమ్మిది లక్షలు రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి.

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు. వీధుల వెంట బారులు తీరిన చెట్లు, మధ్యమధ్యలో ఉద్యానవనాలు వాటి మధ్యలో రాజభవనాలు ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు వ్యవసాయ క్షేత్రాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక. నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.

రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదు, ఇవి అనీ వాస్తవాలు, నమ్మగలిగిన వారికీ అంతా శ్రీకృష్ణ పరమాత్మయే!!

ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఎస్‌ఆర్‌ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు.
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు. ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు.


సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం కనిపించే ద్వారకాధీశ్‌ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి -కృష్ణ ద్వారక. 

ఇంకా చదవండి »