గీతలో కేశవనామాలు


సర్వశాస్త్రమయీ గీతాసకల శాస్త్రసారమే గీత అని వ్యాసుడు మహాభారతంలోని భీష్మపర్వంలో పేర్కొన్నాడు. ఎందుకంటే శాశ్రాలన్నీ వేదాలనుండి ఏర్పడ్డాయి. వేదాలు బ్రహ్మముఖం నుండి వెలువడ్డాయి. అటువంటి బ్రహ్మ పద్మనాభుడిగా పిలువబడే భగవంతుని నాభి కమలం నుంచి ప్రభవించాడు. ఈ రీతిని గమనిస్తే భగవంతునికి, శాస్త్రానికి మధ్య చాలా అంతరం ఉండి. కాని భగవద్గీత విషయంలో భగవద్గీతను శ్రవణ, కీర్తన, పఠనాదులు ద్వారా మననం చేస్తూ వుంటే ఇతర శాస్త్రాలతో పని లేదు. ఎందు చేతనంటే అది సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ విష్ణుభగవానుని ముఖ కమలం నుండి ప్రభవించినది అని వ్యాసుడు పేర్కొన్నాడు.

గీత ఆ భగవానుని కంటె శ్రేష్ఠమైనదని చెప్పినా ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. భగవానుడే స్వయంగా నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీతయే నా నివాసం. ముల్లోకాలను పాలించటంలోనే గీతా జ్ఞానమే నాకు పరమ సాధనముఅని పలికాడు. అంతేకాక అంతర్యామియైన నా యందు లగ్నమైన మనస్సు ద్వారా సమస్త కర్మలను నాకు సమర్పించి ఆశారహితుడై, మమతారహితుడై కర్మనాచరిస్తే (ఇది భగవంతుని మతం) వారు కర్మల నుండి ముక్తులై మోక్షాన్ని నిస్సందేహంగా పొందుతారని భగవంతుడు గీతలో ప్రకటించాడు.


మహాభారతంలో వ్యాసుడు రచించిన ఒక నవలనీ, కురుక్షేత్ర సంగ్రామం అసలు జరగలేదని, కృష్ణుడు హి-మాన్లాంటి కల్పితపాత్ర అని నాస్తికులు కొట్టి పారేస్తారు. కాని అమెరికాకు చెందిన నాసా శాస్రవేత్తలు కృష్ణుడు క్రీ.పూ.3228, జూలై 21వ తేదిన జన్మించి, క్రీ.పూ.3102, ఫిభ్రవరి 17వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు మరణించినట్లు నక్షత్ర గ్రహకూటమి ఆధారంగా లెక్కకట్టి నిర్థారించారు. ఆయన నిర్యాణం చెందిన రోజు నవగ్రహాలు, మేషరాశి ఒకే రేఖపై నిలిచాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ద్వారకా (గుజరాత్) సముద్రం అడుగున లభించిన కృష్ణుడు పాలించిన ద్వారకాపట్టణం అవశేషాలు పురావస్తుశాఖ కనుగొని, క్రుషుడు ద్వారకా నగరాన్ని పాలించినట్లు చారిత్రిక ఆధారాలతో నిరూపించింది. మహాభారత సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసిన సమయంలో కృష్ణుని వయస్సు 90 సం||రాలని కూడా నిర్ధారించారు. అంటే కురుక్షేత్ర యుద్ధం తరువాత సుమారు 35 సం||రాలు కృష్ణుడు ద్వారకానగరాన్ని పరిపాలించాడని అవగతమవుతోంది. దీనారాజాదాస్ అనే పరిశోధకుడు క్రీ.పూ.5 సం|| లేదా 2 సం||లో భగవద్గీత వ్రాయబడి మహాభారతంలో చేర్చబడిందని తన అభిప్రాయాన్ని తెలిపాడు. తన వాదనకు సరియైన ఋజువును ప్రతిపాదించలేకపోయాడు. వ్యాసుడు పురుషోత్తముడైన కృష్ణుని విష్ణువు యొక్క అవతారంగా భావించిసహస్రనామాలతో (విష్ణు సహస్ర నామస్తోత్రం) స్తుతించాడు. నేతి స్పీడుయుగంలో భగవదర్చనకు కేవలం కొన్ని సెకన్లు లేదా నిముశాలను కేటాయించలేని మనకు, విష్ణువు యొక్క వేయి నామాలు ఉచ్చరించడానికి సమయం చిక్కటం లేదు. అందువల్ల భగవద్గీతలో వ్యాసుడు కృష్ణుని సంబోధించిన పేర్లను స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితాన్ని పొందగాలుగుతాం. ఆ పెర్లేంతో తెలుసుకునే ముందు మహిమాన్వితమైన విష్ణునామాలను గూర్చి ప్రస్తావించు కొందాం. బ్రహ్మవైవర్త పురాణంలో విష్ణునామమహిమ విశేషంగా పేర్కొనబడింది.

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామ గోవిందం దధివామనమ్

పై పది విష్ణునామాలు భక్తితో వందసార్లు జపిస్తే మానవుడు రోగ విముక్తుడగుతాడు. లక్షసార్లు జపిస్తే మానవుడు రోగవిముక్తుడగుతాడు. లక్షసార్లు జపిస్తే బంధ విముక్తుడవుతాడు. పదిలక్షసార్లు జపిస్తే గొడ్రాలు సంతానవతి అవుతుంది. కోటిసార్లు జపిస్తే జీవన్ముక్తుడవుతాడు. బదరీనాథ్ (నారాయణక్షేత్రం)లో జపిస్తే సర్వసిద్ధులు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.

ప్రహ్లాదకృత హర్యష్టకంకూడా చాలా మహిమాన్వితమైనదే. దీనిని చదివితే దుఃఖసాగర శోషణంసముద్రం వంటి దుఃఖం కూడా ఎండిపోయి (నివారించబడి) సుఖం కల్గుతుందని, విష్ణువు యొక్క పరమపదం (వైకుంఠప్రాప్తి) లభిస్తుందని ప్రహ్లాదుడు పేర్కొన్నాడు. హరి: ఓంమహిమాన్వితమైన విష్ణువు యొక్క అతి చిన్న మంత్రం. అదేవిధంగా ఓం శ్రీంలక్ష్మీదేవి యొక్క అతి చిన్నమంత్రం. ఈ రెండింటిని కలిపి మననం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

విష్ణు షోడశ నామస్తోత్రం 
మనం అనునిత్యం చేసేపనికి విష్ణుని ఒక్కొక్క పేరుతో స్మరిస్తూ వుండాలి. కాని, సర్వకాలాల్లో మాధవుని స్మరించాలి. ప్రతి ఉదయం నిద్రలేస్తూనే స్మరించాల్సిన విష్ణునామాలు క్రింది స్తోత్రంలో వివరించబడ్డాయి.

ఔషధే చింతయేత్ విష్ణుం భొజనే చ జనార్దనం
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే
దుస్స్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూదనం

కాననేనారసింహం చపావకే జలశాయినం
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే

ప్రతీ దేవునిపూజా సంకల్పంలో చెప్పే 24 విష్ణునామాలు 
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః.

భగవద్గీతలో ప్రస్తావించిన కేశవనామాలు 
భగవద్గీతలో 18 అధ్యాయల్లో, 700 శ్లోకాల్లో వేదాంత విషయం గంభీరంగా చర్చింపబడింది.

4-7-9-12-13-15-16 అధ్యాయాల్లో కృష్ణుని ఏ పేరుతోను వ్యాసుడు సంబోధించలేదు. మిగిలిన అధ్యాయాల్లో పేర్కోన్న విష్ణు (కృష్ణ) నమాలు
1. హృషీకేశ
2. అచ్యుత
3. కృష్ణ
4. కేశవ
5. గోవింద
6. మధుసూదన
7. జనార్దన
8. మాధవ
9. వార్హ్ణే య
10. అరిసూదన
11. పూరుష
12. పురుషోత్తమ
13. పరంబ్రహ్మ
14. పరంధామ
15. ఆదిదేవ
16. అజ
17. శాశ్వతం
18. విభు
19. భూత భావనా
20. భూతేశ
21. దేవదేవ
22. జగత్పతి
23. యోగీ
24. భగవన్
25. వాసుదేవ
26. కమల పత్రాక్ష
27. పరమేశ్వర
28. ప్రభు
29. మహాయోగేశ్వర
30. హరిః
31. విశ్వేశ్వర
32. విశ్వరూపా
33. సనాతనపురుష
34. మహాత్మా
35. మహాబాహో
36. విష్ణు
37. అనంతరూప
38. అనంతవీర్య
39. యాదవ
40. జగన్నివాస
41. సహస్రబాహు
42. విశ్వమూర్తి
43. అనాది
44. లోకమహేశ్వరం

పై నామాల్లో కేవలం పన్నెండునామాలు మాత్రమే రెండు లేదా దానికంటే ఎక్కువ సార్లు పేర్కొనబడ్డాయి.


వీటిలో మహిమాన్వితమైన వాసుదేవనామంతో ఓం నమో భగవతే వాసుదేవాయఅనే ద్వాదశాక్షరీ రూపొందించబడింది. దీనిని నిత్యం జపిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కేశవనామాలను క్రమం తప్పకుండా జపిస్తే అనంతపుణ్య ఫలం దక్కడంతో పాటు మంచి జరుగుతుంది.