మాఘ బహుళ సంకష్ట హర చతుర్తి

ప్రతీ నెల కూడా బహుళ చవితి రోజున గణపతిని అర్చిస్తూ ఉంటారు, అభిషేకం , హోమం చేస్తుంటారు . బహుళ చవితి కి విశేషం . బాద్ర పద మాసంలో వచ్చే సుద్ధ చవితి కి వినాయక చవితి చేస్తాము ఎందుకంటే ఆ రోజు అయన అవతరించారు అని పూజ చేస్తుంటాము . బాద్ర పద బహుళ చవితి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత  మాఘ బహుళ చవితి కూడా ఉంది . మాఘ మాసం లో వచ్చే సుద్ధ చవితి కి బహుళ చవితి కి విశేషం .

చవితి రోజున వినాయకుడికి పూజ ఒకలాగా ఉంటుంది . సుద్ధ చవితి కి పొద్దున్న పూజ చేస్తారు అంటే అభిషేకం , హోమం , పూజ చేస్తుంటారు కానీ పూర్ణిమ తరువాత వచ్చే బహుళ చతుర్ది మాత్రం చంద్రోదయం అయాక మాత్రమే విశేష పూజ చేయాలి. సాయంత్రమే చంద్రోదయం అయాక మాత్రమే పూజ చేయాడం విశేషం . పద్దతి కూడా సాయంత్రమే పూజ చేయాలి . పొద్దున్న నుంచి ఉపవసించి సాయంత్రం చంద్రోదయం అయ్యాక అభిషేకం చేసి , అర్చన చేసి , చంద్రుడికి , రోహిణి నక్షత్రానికి , చతుర్ది తిథి కి అర్గ్యమ్ ఇచే పద్దతి కూడా ఉంది . బాద్రపద సుద్ద చవితి రోజున గణపతి కి పూజ చేయడం వలన గణపతి అనుగ్రహం ఎలా కలుగుతుందో , గణపతి పూజ కి ఎలా విసిష్టమైనదో మాఘ సుద్ధ , బహుళ చవితి కూడా అంటే విసిష్టమయినది పురాణాలూ చెపుతునయి . 

అయితే ఆ రోజు పూజ ఎలా చేయాలి . ఏ రూపంలో గణపతిని తలుచుకోవాలి ? ఎం నైవేద్యం పెట్టాలి అని శివమహపురణం , గణపతి పురాణం లో ఉంది.

ఎవరయిన సంకష్టహర చతుర్థి ప్రారంబించాలి అని అనుకుంటే మాఘ బహుళ చవితి , శ్రావణ బహుళ చవితి కానీ ప్రారంబించాలి. ఎవరయినా కాశి క్షేత్రం లో ఉన్న తప్పకుండ మాఘ బహుళ చవితి రోజున దుండి గణపతి ని దర్శించుకోవాలి . కాశి క్షేత్రం లో ఉండి మాఘ బహుళ చవితి రోజున దుండి గణపతి ని దర్సించకపొతె తప్పు అని కూడా చెపుతారు . అక్కడ లేకపోయినా దుండి గణపతిని తలచుకుని నమస్కరించుకొవదమ్ కూడా విశేషం . 

మాఘ బహుళ చవితి రోజున ఎం చేయాలి?
ఈ రోజున తలమీద నుంచి స్నానం చేసి సంకాల్పమ్ చెప్పుకోవాలి . ఈ రోజు నుండి ఒక సంవత్సర కాలం పాటు సంకష్ట హర చతుర్ది చేస్తాను , ఏ విఘ్నాలు కలగకుండా చూదమని , మనకి ఉండే కామనలు , లేదా కోరికలు ఆటంకాలు కలుగుతునాయో , ఆ ఆటంకాలు తొలిగిపొవలి అని సంకల్పం చేసుకోవాలి . ఉదయం పూజ చేయాలి , అభిషేకం చేయాలి , హోమం చేయాలి . ఆ రోజు అంతా ఉపవసించాలి . రాత్రి మల్లి అభిషేకం చేయాలి , గణపతి కి ఎర్రని బట్టతో అలంకరించాలి , ఎర్ర చందనం/ రక్త చందనం తో  అలకరించలి . జిల్లేడు పువ్వులు , గరిక , తుమ్మి పువ్వులు , బిల్వ పత్రం తో పూజ చేయాలి . గణపతి కి ఎర్రని పూలు అంటే చాల ఇష్టం . ఎర్ర మందార పూలు , కలువలు తో మాలలు చేసి గణపతికి అలకరించలి . 

నైవేద్యం 
పాయసం , లడ్డు , ముక్యంగా మాఘ మాసం లో నువ్వులు బెల్లం తో చేసిన లడ్డులు నివేదన తప్పకుండ చేయాలి. మొదకలు (సహస్ర మొదకలు ఎవరు నివేదన చేస్తారో వారికీ సకల సంకటాలు తిసివేస్తాడు అంట ). 

గణపతి కి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం 


చతుర్ధి తిధి కి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం


చంద్రుడికి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం : రాగి పాత్రలో జలం తెల్లని  పువ్వులు , పసుపు , కుంకుమ , అక్షింతలు , పెరుగు వేసి అర్ఘ్యం ఇవ్వాలి . చంద్రుడికి కూడా నివేదన చేయాలి . 

అ తరువాత బ్రాహ్మణులకి లేదా పేద వారికీ భోజనం పెట్టి తరువాత గృహస్తు ఇంక ఉపవాసం ఉండలేను అనుకునే వారు భోజనం చేయాలి . లేకుంటే ఇంకా అ రాత్రి కి ఏమి తినకుండా రాత్రికి జాగరణ కూడా చేసి మరునాడు పునః పూజ చెహ్సిన తరువాతనే తినాలి . ఉండలేనివారు ఉపహారం చేసి అయిన ఉండవచ్చు . 

సాయంత్రం చంద్రుడికి , వినాయకుడికి , చతుర్ది తిధి కి అర్ఘ్యం ఇవాలి . 

మంగళవారం నాడు చవితి తిధి వస్తే అది అంగారక చతుర్ధి అని కూడా అంటారు . కుజ గ్రహం వలన బాద పడే వారు , మాంగల్య దోషాలు ఉన్న వాలు తప్ప కుండ చేయడం వలన వారికీ దోషాలు పోతాయి . మాఘ మాసంలో మంగళవారం నాడు సంకష్ట హర చతుర్ధి తిధి రావటం ఇంకా విశేషం . 

 సంకష్ట హర చతుర్తి తిధి నిర్ణయం ఎలా చేయాలి ? తిధి తగులు మిగులు వచ్చినప్పుడు , తిధి నిర్ణయం ఎలా చేయాలి ?

ధర్మసింధు గ్రంధల ప్రకారం సుద్ధ చవితి కి చేసే పూజ ప్రాతః కాల పూజ. సంకష్ట హర చతుర్తి కి మాత్రం కచితంగ చంద్రోదయానికి చతుర్ది తిధి ఉండాలి . పగలు మొత్తం చతుర్ధి తిధి ఉండి చద్రోదయానికి చతుర్ధి తిధి లేకపోతె ఆ రోజు సంకష్టహర చతుర్ధి కాదు . 

పూర్ణిమ రోజు అయితే సాయంత్రం సూర్యుడు అస్తమించే టప్పటికి చంద్రుడు కనిపిస్తాడు . బహుళ పక్షం లో చంద్రుడు కొంచం రావటం ఆలస్యం అవుతుంది , పాడ్యమి ఇంకా కొంచం ఆలస్యం , విదియ ,తదియ కి ిన ఆలస్యం , చవితి కి చంద్రోదయం సమాయం ఇంకా కొంచం ఆలస్యం అయి మనకి రోజు 8 గంటలకి వస్తుంది అనుకుంటే (క్యాలెండరు లో చూడవచు చంద్రోదయ సమయం ). అ సమయానికి చవితి తిధి ఉందా లేదా అని చూసుకుని చవితి ని పాటించాలి . చాల మంది ఉదయం అంతా చవితి తిధి ఉంది సాయంత్రం కూడా 7:45pm వరకు కూడా చవితి తిధి ఉంది కాబట్టి ఈ రిజే సంకష్టహర చతుర్ధి అంటారు , కానీ చద్రొదయనికి చవితి లేకపోతే అది సంకష్ట హర చతుర్ధి కాదు . అలాగే ఒకో సరి ఉదయం అంతా తదియ తిది ఉంది రాత్రి 7:30pm లేదా 7:50pm వరకు తదియ ఉండి తరువాత 8:00pm కి చవితి తిధి కలిస్తే ఆ రోజు చేయాలి . రేపు అంతా చవితి తిది ఉంది కదండీ రేపు రాత్రి 7:55pm వరకు కూడా ఉంది అనుకుటే రేపు చెయ్యకూడదు , ఎందుకంటే పగలు అంతా చవితి తిది ఉన్న చద్రోదయానికి పంచమి వచేస్తుంది కాబట్టి చవితి చేయకూడదు .  

అయితే ఒకో సరి ఈ రోజు చద్రొదయనికి చవితి తిధి కలిసి మరునాడు చంద్రోదయ సమయానికి కి కూడా చవితి తిధి ఉంటుంది . అంటే ఈ రోజు 8:15pm చవితి వచ్చి మరునాడు రాత్రి 9:00pm వరకు కూడా చవితి తిది ఉంటుంది . కానీ ధర్మ సింధు ఎం చెపుతుంది అంటే అల తిధి ద్వయం వచినప్పుడు పూర్వ దినమే చేయాలి మరునాడు రోజు చేయకూడదు . ఎందుకంటే తదియ తో మాత్రమే కలిసిన చవితి ని గణపతి కి పూజ చేయాలి తప్ప పంచమి తో కలిసిన తిదియ గణపతి పూజ కి నిషిద్దం, చెయ్యకూడదు . అందువలన తదియతొ కూడిన చతుర్ది మాత్రమే సంకష్ట హర చతుర్తి చేయాలి కానీ పంచమి తో కూడిన చతుర్ది చేయకూడదు . 
సంకష్ట హర చతుర్తి చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి 
మనం శుక్లపక్షం లో పూజ చెస్తునామ? లేదా బహుళ పక్షం లో పూజ చెస్తునామ ? 
శుక్ల పక్షం లో పూజ చెసెవాలు , రాత్రి వరుకు ఉండనవసరం లేదు . శుక్ల పక్షం లో పూజ కూడా విశేషమే . ఉదయం పూజ చేసుకుంటే సరిపోతుంది . 

ఏదయినా కామ్యం కోసం , ఆటంకాలు తొలిగిపొవలిని కోరుకునేవారు మాత్రం బహుళ పక్షం లో వచ్చే చతుర్ధి తిధి లో పూజ చెయడం వలన సంకటాలు తొలొగిపోతాయని శాస్త్రం చెపుతుంది .

బహుళ పక్షం లో వచ్చే చతుర్ది తిధి చేసే వరన్దికి గుర్తుపెట్టుకోవలిసినది తిధి నిర్ణయం . పూర్ణ తిధి వస్తే ఎ గొడవ లేదు , కానీ ఒక వేల అల కాక తిధి ద్వయాలు ఏర్పడినప్పుడు (నక్షత్రం , గ్రహాల తో ఏ సంబంధం లేదు )  పొతే చన్ద్రొదయనికి చవితి తిధి ఉంటె చాలు . రాత్రి కి చవితి తిధి ప్రారంబం అయితే తదియ తో కలిసినది కాబట్టి ఆ రోజే ( సంకష్ట హర చతుర్తి ) చేయాలి కానీ మరునాడు చేయకూడదు . 

ఈ రోజు అంతా కూడాను కింది మంత్రం జపించటం వలన సంకటాలు అనీ తొలిగిపోతాయి .