ద్వాదశార్యా స్తుతి
"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని శాస్త్రవచనం. వేదంలో సౌర, అరుణమంత్రాలు శక్తివంతమైన ప్రభావం కలిగినవి. వాటిలోని
భావాలను, శబ్దశక్తులను మిళితం చేసిన
దివ్యస్తోత్రమిది. శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడు ఒకసారి మహావ్యాధిగ్రస్తుడై,
కృష్ణోపదేశంతో సూర్యోపాసన దీక్షను వహించాడు.
సముద్ర తీరంలో దీక్షాబద్ధుడైన సాంబునకు ఆకాశమార్గం నుండి ఒక దివ్యపత్రం ఎగిరవచ్చి
చేరింది. ఆ పత్రంలోనివి ఈ శ్లోకాలు. వీటిని నియమంగా రోజూ పారాయణ చేస్తే
సంపూర్ణారోగ్యం చేకూరుతుంది. వ్యాధులన్నిటినీ నివారింపజేసే ఈ స్తోత్రంలో
వైదికమంత్ర స్ఫురణ నిబద్ధమై ఉంది. సాక్షాత్తు భాస్కర భగవానుడు అనుగ్రహించిన
అక్షరౌషధమిది.
౧. ఉద్యన్నద్య వివస్వా- నారోహన్నుత్తరాం దివం దేవః!
హృద్రోగం మమ
సూర్యో హరిమాణం చాశు నాశయేదఖిలమ్!!
౨. నిమిషార్ధేనైకేన ద్వేచ శతే ద్వే సహస్రే
ద్వే!
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాథాయ!!
౩. కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి
విశ్వసర్గాయ ద్వాదశథా యో విచరతి స ద్వాదశమూర్తి రస్తు మోదాయ!!
౪. త్వం హి యజూ
ఋక్సామ త్వమాగమస్త్వం వషట్కారః!
త్వం విశ్వం త్వం హంస - స్త్వం భానో! పరమహంసశ్చ!!
౫. శివరూపాద్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్!
శిఖిరూపాదైశ్వర్యం త్వత్త
స్సంప్రాప్తుమిచ్ఛామి!!
౬. త్వచి దోషా దృశి దోషా హృది దోషా యేఖిలేంద్రియజదోషాః!
తాన్పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు!!
౭. ధర్మార్థ కామ మోక్ష - ప్రతిరోధిన
ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్విఖండయతు చండాంశుః!!
౮. యేన వినేదం
తిమిరం జగదేతద్ గ్రసతి చరమచర మఖిలం తం నళినీ భర్తారం హర్తారం చాపదామీడే!!
౯. యస్య
సహస్రాభీశో - రభీశులేశో హిమాంశుబింబగతః భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః
౧౦.
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాశమివాధినికాయం కాలపితా రోగశూన్యతాం
కురుతాత్!!
౧౧. వాతాశ్మరీగదార్శస్ త్వగ్దోషమహోదరప్రమేహాన్ గ్రహణీభగందరాఖ్యా
మహారుజోప్యేష మే హన్తి!!
౧౨. త్వం మాతా త్వం శరణం త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో!!
౧౩. ఇత్యార్యాద్వాదశకం సాంబస్య
పురో నభస్స్థ లాత్పతితం పఠతాం భాగ్యసమృద్ధి - స్సమస్తరోగప్రశాంతిశ్చ స్యాత్!!
ఇతి
ద్వాదశార్యా స్తుతిః