శ్రీమచ్ఛంకరభగవతః కృత కృష్ణాష్టకం
శంకరులు రచించిన కృష్ణుని అష్టకద్వయంలో రెండోది ఈ
కృష్ణాష్టకం. ఈ ద్వయంలో మొదటి శ్రీకృష్ణాష్టకంతో పోలిస్తే ఇది వ్యాకరణపరంగా
కఠినమైనది. ఆధ్యాత్మికంగా లోతైనది. ధ్యానరూపంలో శ్రీకృష్ణుని స్తుతించేది ఈ
అష్టకం. అపార కరుణాంబుధి, ప్రణత ఆర్తిహరుడు, ఆశ్రిత
వాత్సల్యైక మహోదధి అయిన శ్రీ కృష్ణుండు నా ఈ భౌతిక చక్షువులకు కనిపించుమని శంకరులు
వేడుకునే స్తోత్రము ఇది. దీనికి పూర్వ పీఠిక శంకరుల తల్లి ఆర్యాంబ మరణము, ముక్తి.
వేదములలో నుతించబడిన లక్షణములన్ని కలిగినవాడు, సనాతనుడు,
సర్వ జనులకు ఆత్మయైనవాడు అయిన విష్ణువు, ఆదిశంకరులచే
తన తల్లి ముక్తి కొరకు ఈ విధంగా పొగడబడినప్పుడు, లక్ష్మీసమేతుడై
శంఖము, చక్రము, గదతో కూడి ఆ యతి ముంగిట ప్రత్యక్షమై
ఆర్యాంబకు ముక్తి ప్రసాదించాడు.
శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 1
యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదం
స్థితౌ నిఃశేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 2
అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలం
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 3
పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలం
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 4
మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిముతే
బలారాతేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 5
వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 6
నరాతంకోట్టంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 7
యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 8
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కృష్ణాష్టకం సంపూర్ణం
తాత్పర్యము:
లక్ష్మీ సమేతుడు, విష్ణువు,
స్థిర చరములకు గురువు, వేదముల ముఖ్యాంశము, జ్ఞానమునకు
సాక్షి, శుద్ధుడు, హరి,
అసురాంతకుడు, కలువల వంటి కళ్ళు కలవాడు, గద,
శంఖము, చక్రము ధరించిన వాడు, స్థిరమైన
రుచి కలవాడు, వనమాలి, కాపాడే వాడు, లోకేశుడు
అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
పంచ భూతములకు మూలము, మధు
సూదనుడు, ఆనందముతో లోకాన్ని కాపాడే వాడు, ప్రళయ
సమయమున తన శక్తితో సర్వాన్ని తనలో విలీనం చేసే వాడు, కాపాడే
వాడు,లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
నియమ బద్ధులై విధులను పాటించే, ఆత్మపై
నియంత్రణ కలిగిన, లౌకిక విషయముల నుండి దూరముగా ఉండే, స్థిరమైన
మనసు కలిగిన జ్ఞానులచే దర్శించ బడిన వాడు, కాపాడే వాడు, లోకేశుడు
అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
లోకమందు భాగమై దాన్ని శాసించే వాడు, మన
బాధలను తొలగించే వాడు, వేదములలో చెప్పబడిన జగదీశుడు, శుద్ధమైన
వాడు, శాసకుడు, దేవతల, ఋషుల,
మానవుల యొక్క ధ్యాన మూలము అయిన వాడు, మోక్ష
కారకుడు, కాపాడే వాడు, లోకేశుడు
అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
ఇంద్రాది దేవతల అసురులపై విజయానికి మూల శక్తి,
ఎవరి ప్రోత్సాహము లేనిదే కర్మల నుండి విముక్తి కలుగదో, పాండిత్యము
వలన కలిగిన కవుల గర్వమును పోగొట్టే వాడు,కాపాడే వాడు, లోకేశుడు
అయిన అట్టి శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
ఎవరిని ధ్యానిన్చకున్డుట వలన జనులు పంది వంటి పశు
రూపములో జన్మ ఎత్తుతారో, ఎవరిని తెలుసుకోక పోవటం వలన జన్మ మృత్యు మొదలగు
వాటి భయము కలుగునో, ఎవరిని తలచ కుండుట వలన కీటకముల వలె జన్మింతురో,
అట్టి కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు
గాక!
జనుల దుఃఖమును పోగొట్టేవాడు, శరణు
కోరిన వారికి సాయ పడేవాడు, అయోమయాన్ని పోగొట్టే వాడు, నీల
మేఘ శ్యాముడు, వ్రజ కులానికి ప్రియ బాలుడు, అర్జునునికి
సఖుడు, స్వయంభూ, జీవ కోటిని సృష్టించే వాడు, శిక్షకుడు,
రక్షకుడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు
గాక!
ధర్మము నశించి భూ భారము పెరిగినప్పుడు, గోకుల
నందనుడు, ధర్మ పాలకుడు, జన్మ
లేనివాడు, సుజన రక్షకుడు, వేదములచే
పొగడ బడిన వాడు అయిన శ్రీకృష్ణుడు ఆవతారము ఎత్తి ధర్మ సంస్థాపన చేసే వాడు, కాపాడే
వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు
గాక!