వైష్ణవ దేవీ ఆలయం జమ్మూ –కాశ్మీర్
జమ్మూ –కాశ్మీర్ రాష్ట్రం లో జమ్మూ కు 60 కిలోమీటర్ల దూరం లో వైష్ణో దేవి లేక వైష్ణవ దేవీ ఆలయం ఉంది
.ఇది గుహాలయం .సృష్టి స్తితి లయం లకు మూలమైన ఆది పరాశక్తి ని మహా సరస్వతిగా ,మహాలక్ష్మి గా ,మహా కాళిగా
నిరూపించే మూడు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి .భక్తజనం పరమ ఉత్సాహం తో భక్తీ భావనతో ‘’జయ మాతాజీకి‘’అను కొంటు
కష్టసాధ్యమైన ఈ పర్వతం ఎక్కుతారు గుహ చేరే వరకు దాదాపు మోకాలి మీదనే నడుచు కొంటు
గుహ లోకి ప్రవేశిస్తారు .గుహకు చేరాలంటే చాలా దూరం నడవాల్సిందే .అన్ని శ్రమలకు
ఓర్చుకొని అమ్మవారి ని దర్శించటానికి భక్తులు చేరుకొంటారు గుహలోకి చేర గానే తాము
పడిన శ్రమ నంతా యిట్టె మర్చి పోయి అఖండ భక్తీ భావం తో పులకించి పోతారు .అమ్మవారి
కరుణ ను ,ప్రేమను తలచుకొంటూ ఆనంద
పరవశులవుతారు .
జీవితం లో ఒక్క సారైనా
వైష్ణో మాతను దర్శించి తరించాలని అందరి కోరిక .లక్షలాది భక్తులు ‘’త్రికూట పర్వతం‘’పైన ఉన్న ఈ గుహను
సందర్శిస్తారు .అమ్మను దర్శించి ఆశీర్వచనం పొందుతారు .గుహకు చేరే మార్గం లో బాణ
గంగ ,చణ పాదుక ,హాతీ మాధా (ఏనుగు తల ),చణ గంగా అనే ప్రదేశాలను అంచే లంచేలుగా దాటి వెళ్ళాలి
.ఇవన్నీ పవిత్ర స్థలాలే .చరణ గంగ లో నీరు చాలా చల్లగా ఉంటుంది .అంత చల్లని ప్రదేశం
లో దేవీ దర్శనం కోసం భక్తులు అత్యంత శ్రద్ధతో వేచి ఉంటారు .రామాయణం లో స్వయం ప్రభ
అనే తాపసి నివశించిన గుహ లానే ఈ గుహ ఉంటుంది .ఈ గుహ సమీపం లో రామ మందిరం ఉండటం
ఆశ్చర్యమే .
భైరవుడు అనే రాక్షసుని
సంహరించిన శ్రీ వైష్ణవీ దేవి అతనికి మోక్షాన్ని కూడా ప్రసాదించింది .భైరవాలయం కూడా
దేవీ మందిరానికి కొంచెం దూరం లోనే ఉంది అమ్మను దర్శించిన తర్వాత భైరవ దర్శనం చేయటం
పరి పాటి.