తిరుచెందూర్ సుబ్రమణ్య దేవాలయం లోని ఒక మంచి విషయాన్ని (స్కాంద పురాణం) ప్రస్తావించారు.


శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రం లోని 25 వ శ్లోకం, 3 వ పంక్తి గూర్చి ఒక్క విషయం.  ".. భవత్పత్రి భూతిం" అనగా తిరుచెందూర్ సుబ్రమణ్య దేవాలయం లోని ఒక మంచి విషయాన్ని (స్కాంద పురాణం) ప్రస్తావించారు.

మనందరకూ శ్రీమద్రామాయణం లో గురు విశ్వామిత్రులు వారు మన స్వాములు శ్రీ రామ లక్ష్మణుల వారిని  తాను చేస్తున్న యజ్ఞాన్ని పరివిదాలా భంగం చేస్తున్న తాటకి మరి ఇతర రాక్షసులను (కర దూషనాదులు) సంహరించేన్డులకు తీసుకొని వెళ్ళిన విషయం తెలిసినదే.  ఆ రాక్షసులను సంహరించటం జరిగింది.  ఇక్కడ తాటకి ఒక స్త్రీ అగుట వలన, పెద్ద చిక్కు సమస్య ఏర్పడినది.  ఈ దోషం మన స్వామి కి మన సీత అమ్మ వారి తో ఎడబాటు తో తీరినది.  కానీ ఆ రాక్షస సంహారానికి మూల కారణమైన గురు విశ్వామిత్రులు వారికి ఆ తర్వాతి కాలం లో తీవ్రమైన చర్మ వ్యాది తో బాధపడ వలసి వచ్చినది.  చివరకు పరమేశ్వరుని ప్రార్థించగా శ్రీ జయంతి పురం (ఈనాటి తిరుచెందూర్) వెళ్లి శ్రీ సుబ్రమణ్య ని శేవించ మని ఈశ్వరుడు చెప్పగా, విశ్వామిత్రులు వారు అక్కడ కు వెళ్లి ఆ దేవాలయం లో అక్కడ లబించే పన్నీరు ఆకులలో విభూతి ని తీసుకోగానే తనకు పరిపూర్ణ ఉపసెమనం లబించినది.  విశ్వామిత్రులు వారు మనందరి కోసం "ఎవ్వరయినా ఇక్కడి ఈ పన్నీరు పత్రం లో విభూతి ని తీసుకోన్నచో వారికి గల శారీరిక బాదలు తొలగాలని" ఆ స్వామిని వేడుకోన్నారట.


ఈ విషయాన్ని స్కాంద పురాణం నుండి తీసుకోబడినది గా, ఈనాడు కూడా తిరుచెందూర్ సుబ్రమణ్య దేవాలయం లో ఈ పన్నీరు పత్రం లో విభూతి ని ఇవ్వటం, వాటి మహిమ చూడవచని సూచిన్చినారు.