పుర-హిత
మామూలుగా అందరూ, ఇళ్ళల్లో
సత్యనారయన వ్రతాలు, పెళ్ళిళ్ళు, వడుగులు చేయించే వ్యక్తే పురోహితుడు అనుకుంటారు.
అసలు అర్ధంలోకి వెడితే, పురమునకు
హితము చెప్పేవాడు పురోహితుడు. పురముకు అంటే ఊరిలో ఉన్న ప్రజలకు, హితము చెప్పటం. అంటే ‘ఇది మంచిది ఇది మంచిది కాదూ అని తెలియజేసి అందరి
మంచిని కోరుకునే వాడే పురోహితుడు. అంతేకాని ఛాందస బ్రాహ్మణుడు కాడు. అంతరంలోకి
వెడితే, బాహ్యంగా
ఉండే ఊరిని పురం అన్నట్లే, ప్రతి
వ్యక్తిలో అంతరంగా ఉన్న హౄదయమే పురం. భగవంతుని నివాసస్ధానం. మనలో ఉన్న హౄదయమే
పురం. అంతరంగా ఉన్నది కనుక అంత:పురం అనవచ్చు. అదే శ్రీపురం, శివశక్తి స్ధానం. నీ ఉనికికే మూలం. అత్మ నిలయం, అంతరంగ ప్రశాంతి నిలయం. శ్రీ చక్రానికి అధిపతి
శ్రీ సుందరి, శ్రీ
పురానికి అధిపతి త్రిపురసుందరి. అమ్మ స్ధానమే ఆదిమూలం, ఆదిమూలానికి అమ్మే మూలం, హితం,
అహితం, హితాహితం
అన్నీ అమ్మే, అది
చేప్పేది అమ్మే, ఆది
ప్రసశక్తి అమ్మే!!!
అందరికి అమ్మే పురహిత!