మన సంస్కారాల అంతరార్థం
భారతీయ సంస్కౄతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే
ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు
మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని
చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
మనుస్మౄతి ఈ సంస్కారాలను 12
సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ
సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా
పేర్కొన్నారు.
కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా
గుర్తించారు.
మనిషి
పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత
ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి
మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారల ఆచరణ మనిషి జీవితంలో
వివాహాంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే.
స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం
పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా
మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. వేదోపనిషత్తుల
ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.
1. అన్నమయ
కోశం – భౌతిక
శరీరం
2. ప్రాణమయ
కోశం – శక్తి
కేంద్రం
3. మనోమయ
కోశం – చింతనా
కేంద్రం
4. బుద్ధిమయ
కోశం – వివేకం
5. అనందమయ
కోశం – పరమశాంతి
మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా
సక్రమమైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ణానిక
రహస్యాలు నేతి వైజ్ణానికులకు సైతం అశ్చర్యపరుస్తాయి.
1. వివాహం
: వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత,
పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయమయ్Yఏందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
2. గర్భాదానం
: స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం
నిర్దేశించబడింది.
3. పుంసవనం
: తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
4. సీమతం
: గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది.
5. జారకకర్మ
: బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది
నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
6. నామకరణం
: బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వౄద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి
దండ్రులు జరిపే సంస్కారం.
7. నిష్ర్కమణం
: బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచYఅం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం
: బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని
పరిచయం చేయడం.
9. చూడాకర్మ
: పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ
: చెవులు కుట్టించడం.
11. ఉపనయనం
: బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
12. వేదారంభం
: సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం
: పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం
: బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం
: ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం.
16. అంత్యేష్టి
: పిత్రూణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం.