కు౦తీదేవి చేసిన కృష్ణస్తుతి
పోతన భాగవతం - అశ్వత్థామ
ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి ఉత్తరా గర్భాన్ని రక్షించిన సందర్భంగా కుంతీదేవి
- ప్రథమ స్కంధం -186పద్యం
పురుషుండాడ్యుడు ప్రకృతికి
బరు డవ్యయు డఖిల భూత
బహిరంతర్భా
సురుడును లోక నియంతయు
పరమేశ్వరుడైన నీకు
బ్రణతులగు హరీ!!
ప్రథమశ్చ ద్వితీయశ్చ చరణౌ
ద్వౌ ప్రకీర్తితౌ!
తృతీయశ్చ చతుర్థశ్చ
ద్వావూరూ సముదీరితౌ!!
పంచమౌ నాభిదేశశ్చ షష్టో (shashto)
హృదయ ముచ్యతే!
సప్తమ శ్చాష్టమశ్చైవ బాహూ
ద్వౌ పరికీర్తితౌ!!
నవమః కంఠదేశః స్యాత్ దశమో ముఖమేవ
చ!
ఏకాదశో లలాటం చ ద్వాదశస్తు
శిఖోచ్యతే!
ఏవం సర్వం భాగవతం
శ్రీహరేరంగ ముచ్యతే!!
భాగవతం లోని ప్రథమ ద్వితీయ
స్కందాలు భగవంతుని చరణాలనీ, తృతీయ చతుర్థ స్కందాలు
ఊరువులనీ, పంచమ స్కంధం నాభిప్రదేశమనీ,
షష్ఠ స్కంధం హృదయమనీ, సప్తమ అష్టమ స్కంధాలు బాహువులనీ నవమ స్కంధం కంఠమనీ,దశమ స్కంధం ముఖమనీ, ఏకాదశం లలాటమనీ,
ద్వాదశం శిఖ అనీ వివరించబడింది. ఇందులో దశమ
స్కంధం భగవంతుని ముఖమని చెప్పడం వల్ల దాని ప్రాధాన్యం ఎంతటిదో అభివ్యక్త
మవుతున్నది.
దశావతారాలలో శ్రీ
కృష్ణావతారానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లే భాగవతం లోని పన్నెండు
స్కంధాలలోను దశమస్కందానికి ఒక విశిష్ట స్థానం ఉన్నది. సమగ్రంగా సర్వాంగ సుందరంగా
శ్రీకృష్ణ చరిత్రం అభివర్ణింపబడిన దశమ స్కంధం "శ్రీకృష్ణ లీలాసర్వస్వం"
అనటంలో అతిశయోక్తి అణుమాత్రం లేదు.