దుర్గాదేవి కి ఎ పూలతో పూజ చేయవలి?
మల్లికాముత్పలం
పద్మం శమీపున్నాగచంపకమ్ |
అశోకం కర్ణికారం
చ ద్రోణపుష్పం విశేషతః ||
కరవీరం జపాపుష్పం
కుంకుమం నాగకేసరమ్ |
యఃప్రయచ్ఛతి
పుణ్యార్థం పుష్పాణ్యేతాని భారత ||
చండికాయై
నరశ్రేష్ఠ శ్రద్ధాభక్తి సమన్వితః |
సకామానఖిలాన్
ప్రాప్య దుర్గాయా అనుచరోభవేత్ ||
మల్లె, కలువ, తామర, జమ్మి, పున్నాగ, సంపెంగ, అశోక, రేల, తుమ్మిపూలు,
గన్నేరు, దాసాని, కుంకుమ పూవు, నాగకేసరం (బఠాణి మొగ్గ అని కొందరు) మొదలైన
పుష్పములను ఎవడు పుణ్యం కోసం భక్తి శ్రద్ధలతో చండికకు సమర్పిస్తాడో అతడు కోరికలను
నెరవేర్చుకొని దుర్గాదేవికి అనుచరుడగును.
పున్నాగశ్చంపకః
కుందో యూధికా నవమల్లికా |
తగరార్జున మల్లీ
చ బ్రుహతీ శతపత్రికా ||
తథా కుముదకల్హార
బిల్వపాటలమాలతీ |
జపా విచికిలాశోక
రక్తనీలోత్పలాని చ ||
దమనో మరుపత్రంచ
శతపుణ్యవివర్థయే ||
పున్నాగ, సంపెంగ, మల్లె, అడవిమల్లె, గ్రంది తగరము,
తల్లమద్డి, జాజి, వాకుడు, నూరురేకుల తామర,
కలువ, తెల్లతామర, మారేడు, కలిగొట్టు, మాలతి, దాసాని, విచికిల (ఒక జాతి
మల్లె), అశోక, ఎర్రకలువ, నల్లకలువ, దవనం, మరువం -- ఇవి దుర్గాదేవి పూజలో నూరురెట్లు పుణ్యాన్ని కలుగ జేస్తాయి.
భవిష్యపురాణాం నుండి గ్రహించబడినది !!