• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

ఆస్వీజమాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆస్విజ శుక్ల ఏకాదశి విశేషం ఏమిటి?

ఆస్విజ శుక్ల ఏకాదశి ని పాసాంకుస ఏకాదశి అంటారు అంటే పాశం అంకుశం అంటారు . అంటే యమ పాశం నుంచి ఈ రోజు ఏకాదశి వ్రతం చేయటం వలన మనని కాపాడుతుంది ఇది అంకుశం లాంటిది. ఈ కాలం లో అనేక రోగాలతో బాదపడుతూ ఉంటారు. ఈ నెలలో అనేక రోగాలు ప్రభాలే అవకాసం ఉంది. 

ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువు కి వెళ్ళే కాలం అ సంధి కాలం లో అనేక రోగాలు ప్రబలే అవకాసం ఉంది. యమ పాశం నుంచి రక్షణ కావలి అనుకునే వారు అంతా పూజ చేయాలి. నిరాహారం గ ఉంది నారాయణ మూర్తి ని స్మరించాలి , సేవించాలి.

ఈ మాసం లో పొద్దున్న అంతా ఉపవసించి సాయంత్రం పూట తులసి దగ్గర లక్ష్మి నారాయణల కి పూజ చేయాలి అంటారు. ఈ విదంగా కర్తీక మాసం లో కదా చేయాలి , ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్రాతని చేసే వారు ఈ ఏకాదశి నుంచే ప్రారంబించాలి అంటారు. ఈ తులసి కి అలికి 5 రకాలా పద్మాలు 5 ముగ్గులు, 5 రకాల వంటలు నైవేద్యం పెట్టాలి. తులసి కి నారాయనుకి దీపం పెటాలి. రాత్రి అంతా నారాయణ మూర్తి బజన చేయాలి. నారాయణనుని అనుగ్రహం పొందాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియలలో పారణ చేయాలి.

ఆస్విజ శుక్ల ఏకాదశి, ఆస్విజ బహుళ ఏకాదశి, కార్తిక సుద్ద ఏకాదశి ఈ 3 ఏకాదశి లో ఈ వ్రతం నియమాలు ఇలాగే చేయాలి అని ప్రత్యేకం గ కనిపిస్తుంది.

దీపావలి తెలవారి నుంచి కార్తిక మాసం ప్రారంభం కాబట్టి నది స్నానం చేయాలి అనుకుంటూ ఉంటారు , కానీ శాస్త్రం ఎం చెపుతుంది , ధర్మ సింధు ఎం చెపుతుంది: కార్తీక స్నానం అని పేరు ఉన్న దీన్ని ఆస్విజ శుక్ల దశమి(విజయ దశమి ) కానీ , ఏకాదశి కానీ లేదా ఆస్విజ సుద్ద పౌర్ణిమ రోజు కానీ ప్రారంబించాలి అని చెపుతునారు.

కార్తీక స్నానం ప్రత్యేకం ఏమిటి ?

సూర్యోదయం ముందు గా 2 ఘడియల ముందు గా అంటే 48 నిముషాలు ముందు గా , నది లో
స్నానం చేయాలి . నాభి మునుగే వరకు మునిగి స్నానం చేయాలి. ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడు నది లో స్నానం చేయటానికి వెళ్ళాలి. నదికి స్నానం చేయకుండా వెళ్ళకూడదు. అక్కడ స్నానం చేసి సూర్యుడికి , అమ్మవారికి , గణపతి , నారాయణకి నమస్కరించి అర్ఘ్యప్రదానం చేయటం , తెలిసి తెలియక చేసిన పాపలు పోవాలి అని నమస్కరించుకోవాలి. నది తీరాన లేని వాలు ఇంట్లో అయిన నక్షత్రం ఉండగా స్నానం చేసి దీపం పెటాలి. తులసి దగ్గర కూడా దీపం పెట్టాలి.

నియమాలు కూడా చాలా ఉనాయి, చాతుర్మాస దీక్షలొ ఎలా నియమాలు పటిస్తమో అలాగే ఇక్కడ కూడా బుసయనం చేయటం , ఏక బుక్తం , బ్రహ్మచర్యం చేయటం , దేవత ఆరాధనా , మొతం దీక్షలొ నక్తం ఉండడం (పగలు అంతా ఉపవసించి , సాయంత్రం ప్రదోష కాలం లో శివారాదన చేసి భోజనం చేస్తారు ). నారాయణ మూర్తి కి సత్యనారాయణ వ్రతం చేసుకోవటం , లేదా శివరాదన విశేషం గ చేసుకోవాలి.


ఇంకా చదవండి »

ధన త్రయోదశి


ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

వ్రత విధానం
 ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.

ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు.

ఇంకా చదవండి »