హనుమ జయంతి

రామ భజన చేస్తూవుంటే అందరికంటే ముందు వచ్చి అందరికంటే ఆకరున వెళ్తారు. ఎక్కడెక్కడ హనుమ వస్తారో అక్కడ మంగళములు జరుగుతాయి. 

హనుమ ని ఆరాదించే :
హనుమ గురించి వివరించిన గ్రంధం " పరాసుర సంహిత ". 

హనుమజయంతి :
వైశాఖ మాసం లో కృష్ణ పక్షం లో వచ్చే బహుళ దశమి తిధి న పూర్వాభాద్రా నక్షత్రం రోజున మధ్యానం వేల హనుమ ఆవిర్భావం జరిగింది . ఒకో సారి పూర్వాభాద్రా నక్షత్రం కలవకపోయినా హనుమ జయంతి చేసేస్తారు.

వైశాఖ మాసం లో కృష్ణ పక్షం లో వచ్చే బహుళ దశమి తిధి నాడు హనుమజయంతి చేయాలి . హనుమ జయంతి రోజున పరివార సహిత హనుమ ని ఆరాధించాలి . సీతా రామ లక్ష్మణ పాదరవిన్దముల దగ్గర వుండే  హనుమ అనుకుంటాం, కాదు  హనుమ కి సుషేనుడని వానరం ఛత్రం పడతాడు. సుషేణుడు ఛత్రం పట్టిన పటానికి మంత్రం తో ఆవాహన చేయాలి. మైందుడు , ద్వివిదుడు హనుమ కి ఇరువైపులా నిలబడి చామరం వేస్తుంటాడు. అయన ముందు జాంబవంతుడు నడిచి వెళుతూ మంచి చెడు చెపుతూ ఉంటాడు . ఆ పటములో జాంబవంతుడు నడిచి వేల్తునట్లు వెనుక వారు పరివారం అంతా ఉన్నట్లు చెప్పబడింది. శాస్త్రం అందు హనుమ కి పెళ్లి జరిగినది . సువర్చల సమేత హనుమ కి కళ్యాణం చేయటం అత్యంత విశేషం. గృహస్తాశ్రమం లో పెళ్లి కాకపోతే పెద్దలు తరించారు . హనుమ కి ప్రవర ఉంది అయన తండ్రి పేరు కేసరి. హనుమ తాత , ముతాత పేర్లు హనుమ కళ్యాణం లో చెప్తారు . అయన ముతాత గారి పేరు హేమగర్బుడు. వారు తరించడానికి హనుమ పెళ్లి చేసుకున్నారు. 

పిల్లలు పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకోకుండా ఉండకూడదు. అల ఉంటె తల్లి తండ్రి ని చెట్లకి తిరగేసి కట్టి కొడతారు ఎందుకంటే సంస్కార బ్రష్టమయిన పిల్లల్ని కనారు కనుక . 

లోపాముద్ర అగస్త్య ఋషి 

ఒక జీవిత కాలంలో ఇలా హనుమ జయంతి చేస్తే వంశం తరించి పోతారు :
హనుమజయంతి కళ్యాణం చేయిన్చుకున్నరోజు ఒక పుట కచితంగా భోజనం చేసి తీరాలి. యతి పురుషులు భోజనం చెయ్యకూడదు పూర్ణ ఉపవాసం చేయాలి . ఎవరు హనుమజయంతి చేస్తునారో ఆ గృహస్తు భార్య గురువింద గింజలతో పూజ చేయాలి . (కొంచం క్లేశం తో కూడిన పని అందుకనే వివరించటం లేదు , దగ్గరలో ఉన్న వారిని అడిగి తెలుసుకోగలరు ) . భర్త హనుమ పూజ చేసుకుంటూ ఉంటె , భార్య సాయంకాలం వరకు మంచి ఆవు నెతో సాయంకాలం వరకు అప్పాలు ఎన్ని అయితే అనీ చేసి సాయంకాలం సీతా రామ హనుమ కి , హనుమ పరివారానికి మంత్రం తో స్వాగతం చెప్పి ఉపసనన చేసి నివేదన చేయలి. 

సూర్యాస్తమయం కాకమునుపు , హనుమ ఉపాసకులు , సీతరమ హనుమ ఉపాసకులు ఎవరయినా ఉండి మీకు తెలిసిన వారు ఉంటె , లేదా తారస పడితే మీకు బాగా సానిహిత్యం ఉంటే 5 ఆకులు , 5 అరటిపళ్ళు , 5 నేతి తో వేయించిన అప్పాలు వారి ఇంటికి వెళ్లి ఇవటం వలన వారు సంతోసించి కొంచం ముక్క నోట్లో వేసుకోవటం వలన మీ జన్మ తరించిపోతుంది. 5 వకే రకమయిన జాతి పండ్లు , ఆకులు ఇస్తే రామ హనుమ భక్తుడు కొంచం తినటం ద్వార అది హనుమనే తిసుకునట్టు అని పరాసంహిత చెప్తుంది . 

హనుమ పూజ , కళ్యాణం , ఉపాసన అరటి తోటలో చేయడం ద్వార హనుమ తనంత తానే అ ప్రసాదం తీసుకుంటాడు . త్వరగా ప్రసునడవుతాడు. లేదా ఎక్కడ మీరు హనుమ పూజ చేస్తునారో అక్కడ అరటి చెట్లు అరటి గెలలతో వంగి ఉండేట్టు గ కట్టి పూజ చేయలి . ఏదో ఒక రూపం లో హనుమ కి చేరుతుంది . తప్పకుండ హనుమ గురించి వినాలి . 

హనుమద్వ్రతం 
మార్ఘసిర్శ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే త్రయోదశి రోజున హనమద్వ్రతం చేస్తారు . హనుమద్వ్రతం కల్పం ఉంది (కల్పం అంటే ఋషులు నిర్ణయించి పెట్టారు ). హనుమద్వ్రతం కేవలం పంపా నది తీరం లో చేయాలి . ఇంకా ఎక్కడ చేయకూడదు . ప్రతి ఒక్కరు పంపా నది తీరానికి వెళ్ళలేరు కాబటి కలశం పెట్టు దారాలు కట్టి (ప్రక్రియ తెలిసిన వారు మాత్రమే చేయాలి ) పంపా నది ఆవాహనం చెస్తారు .  అప్పుడు పంపా నది తీరాన కుర్చునట్టే , అప్పుడు హనుమద్వ్రతం చేయవచు అని శాస్త్రం చెప్పింది . 

హనుమద్ పిటములు 13 ఉనాయి : పంపా నది ఒక పిటం . 

ఎందుకు చేస్తారు 
మర్ఘసీర్ష మాసం లో శుద్ధ త్రయోదశి నాడి హనుమద్వ్రతం చేస్తారు . చంద్ర వంశం లో సోమదత్తుడు అనే రాజు జన్మించాడు . శత్రు రాజులూ ఓడించడం వలన ఆయనకి రాజ బ్రష్టత్వం వచ్చింది . అప్పటికప్పుడు విజయం కలగాలి అంటే ఎం చేయాలి అని అడిగారు . ఆ కాలం లో అనుకోకుండా మర్ఘసీర్ష మాసం లో శుద్ధ త్రయోదశి తిధి వచ్చింది . ఇప్పటికిపుడు విజయం కలిగించే వ్రతం ఇది . అని చెప్పగానే పంపా నది తీరానికి వెళ్ళలేరు కావున పంపా నది జలాల్ని ఆవాహన చేసి పరమ భక్తీ శ్రధలతో పూజ చేసాడు రాజు . అందువల్ల హనుమ అనుగ్రహం కలిగి విజయం సాదించాడు రాజు . 

హనుమ అనుగ్రహం ద్రౌపతి దేవి మెద కూడా ఉన్నది . ద్రౌపతి దేవి ని పూజ చేసి తన భర్తలకి విజయం కట్టబెటింది .  హనుమ కాలాతీతుడు . అయన ద్వాపర , త్రేతాయుగం లో ఉన్నాడు. సత్యభామ యొక్క గర్వ భంగం చేసిన వారు కూడా హనుమనే . సత్యభామకి అందమునందు ఉన్న అతిశయము పోగొటాలని గరుడుడి ద్వార కబురు పంపారు. హనుమ నేను రాముడు అయితే వస్తాను కానీ కృష్ణ తో నాకేం పని అనాడు . అయితే మల్లి రాముడే రామంటూనాడు అని కబురు పంపారు. అయితే గరుడడు ఇలా అనుకునాడు , హనుమ ముసలి అయన న అంట వేగంగా వెళ్ళలేరు , అయ్యా మీరు న వీపు మిద కూర్చోండి నేను తిసుకువేల్తాను అనాడు . హనుమ , న స్వామి రాముడు పిలిచాడ ? అని ఒక దుముకు దూకి మాయమయిపోయారు . అయితే గరుడుకి ఎం జరిగిందో అర్హం కాక కృష్ణ మందిరానికి తిరిగి వచాడు . తిను వచేలోప హనుమ లోపలికి పోనివుండా సుధార్షునుడు అడ్డు వచాడు . న అనుమతి లేకుండా నువ్వు వెళ్ళటానికి వీలులేదు . లోపల న స్వామి కృష్ణుడు ఉన్నాడు రాముడు కాదు అని . దీనితో హనుమకి కోపం వచ్చి న రాముని చూడటానికి ని అడ్డం ఏంటి అని చట్టుకుని పట్టుకుని మింగేసాడు . మింగి లోపలి వెళ్ళాడు . కృష్ణుడు రాముడిగా దర్సన మిచాడు. చూడగానే హనుమ తన కనిటితో పాదాలు కడిగి తన తల్లి సీతమ్మ పాదాలు ఏవి అని పక్కకి చూసాడు. అప్పుడు సత్యభామ పదాలు కనిపించి పైకి చూసి , స్వామి మీ ప్రక్కన న తల్లి సీతమ్మ కదా ఉండాలి దాసి ఉన్నదేమి అని అడిగాడు . సత్యభామ ఆశ్చర్య పడి కృష్ణునునివంక చూసింది . కృష్ణ పరమాత్మా తిను దాసి కాదు ఈ అంశలో న భార్య సత్యభామ , సీతా రుక్మిణి గ ఉన్నది అని వివరించాడు . అప్పుడు సత్యభామ గర్వం అణిగి సత్యం గ్రహించింది . కృష్ణుడు - హనుమ నివు లోపలి వస్తుండగా నిన్ను ఎవరు అడ్డగించలేదా అని అడిగాడు ?

హనుమ ఎవరు అడ్డగైన్చాకపోవటమే స్వామి ఎవరో సుధార్షునుడు అంట లోపలికి వెళ్ళకూడదు అన్నాడు , అందుకనే మింగేసను , మీరు అడిగారు కాబట్టి వదిలేస్తాను అని ఒక త్రెంపు తేల్చి బయట పాడేసారు. అప్పుడు సుధార్షునుడికి కూడా గర్వ భంగం అయింది . అప్పుడు వచాడు గరుక్మంతుడు . ఇలాగ ద్వాపర యుగం వరుకు అనేక రకాలుగా అవసరం అయిన చోట గర్వభంగం చేస్తూ వచాడు హనుమ . 

వ్రతం చేయటం ఏంతో ప్రసాదం తీసుకోవటం కూడా అంతే.

ఈ రోజు హనుమ జయంతి రోజున 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మాట్లాడకూడదు , నమస్కరించాకుడదు . ప్రదక్షిణాలు చేసేటప్పుడు రాళ్ళు , మిరియాలు , కాగితం మిద గీతాలు , బియ్యం గింజలు తో లేక్కపెట్టకుడదు .

ప్రదక్షిణ ఇలా చేయాలి : తెల్లవారుఝామున స్నానం చేసి ఐ రోజు ప్రదక్షినలు చేస్తాను అని స్వామి హనుమ కి చెప్పి ఏ ఆటంకము లేకుండా పూర్తీ చేయించమని విన్నవించి గుడికి వచేట్టపుడే లెక్కించిన పువ్వులు తెచ్చుకోవాలి . గాలికి పువ్వులు ఎగిరి పోతాయి అని అనుమానం ఉంటె వక్కలు తో లెక్కించుకోవచ్చు. 108 చేయలేని వారు 108/2 = 64 సార్లు చేయాలి . 64 చేయలేను 64/2=27. 27 , 2 తో ఇంక భాగించడం కుదరదు కాబ్బట్టి 11 సార్లు ప్రదక్షిణ . 11 సార్లు చేయలేను 5 సార్లు . 5 చేయలేను అయితే 3. 3 చేయలేను అయతే 1. అదికూడా చేయలేను మానసిక పూజ . ఈ రోజు ఏక జాతి 5 పండ్లు ఇవాలి.

ఎవరయినా ఇంటికి వస్తే ఒక పండు పెట్టకూడదు , 2 ఏక జాతి పండ్లు పెట్టి తాంబూలం ఇవాలి .
శివాలయం లో 108 ప్రదక్షిణాలు అవసరం లేదు . చండి ప్రదక్షిణ చేస్తే చాలు.