దుర్వాస మహర్షి ఒకనాడు తన
శరీరం నిండా భస్మం అలంకరించుకొని రుద్రాక్షమాలలు ధరించి, జగదంబ నామ సంకీర్తనం చేస్తూ పితృలోకాన్ని దర్శించడానికి
వెళ్ళాడు. అపర రుద్రావతారుడగు దుర్ాసుని రాకను గమనించిన యమలోకములోని గవ్యవాలాది
మహర్షులు ఆయనకు ఎదురుగా వచ్చి నమస్కరించి సకలోపచారములు చేసిముచ్చటించుచున్నారు. ఆ సమయంలో దుర్వాస
మునీంద్రునకు కొన్ని ఆర్తనాదాలు వినిపించాయి. అప్పుడాయన "ఓ గవ్యవాలాది
మునీంద్రులారా! సుగుణమండితులారా! ఈ ఆర్తనాదాలకు కారణమేమిటి?" అని అడిగారు. అందుకు వారు "మునీశ్వరా! ఈ లోకాన్ని
సమవర్తి అనే నామాంతరం గల యముడు పరిపాలించుచున్నాడు. జీవులొనరించిన పాపములకు తగిన
శిక్షను అతడు విధిస్తాడు. నీలిరంగు శరీరం కలిగి, నీల వస్త్రములను ధరించి, చేత ఆయుధాలను పట్టిన దూతలు పాపులు పట్టి ఇక్కడికి
తీసుకువస్తారు. ఇక్కడ సలసల కాిగిన నూనెలో కణకణ మండే 86కుండములు బీతిగొల్పుతూ ఉంటాయి. ఆయా జీవి చేసిన పాపాలను బట్టి
యముడు వారిని కుండములలో పడవేస్తాడు. వీనిలో కుంభీపాకమను కుండము మిక్కిలి
భయంకరమైనది. దానిని వర్ణించుటకు నూరేండ్లయినను చాలవు.
దేవీద్రోహులు, శంకరునకు అహితులు, విష్ణువిద్వేషులు,
దేవ-బ్రాహ్మణ-వేద నింద చేసిన వారు, సూర్యగణేశాదులకు ద్రోహమొనరించిన వారు, శాస్త్రజ్ఞానాన్ని తెలిసి కూడా ఆచరించనివారు, గుణవిహీనులు, మాతాపితలను-అగ్రజన్ములను,
స్మృతి-పురాణములను నిందించిన వారు ఈ కుంమున
బడద్రోయబడుదురు. మీరు వినుచున్న కేకలు ఆ కుండమునందలి పాపులు చేయుచున్నవే" అని
వివరించారు. ఆ మాటలు విన్న దుర్వాసుడు
కుంభీపాక కుండము వద్దకు పోయి తలవంచి లోపలికి చూడగా, అందున్న పాపులు నవ్వుతూ, పాడుతూ, ఆడుతూ, మృదంగ వీణా ఢక్క దుందుభి స్వరాలను వింటూ పరస్పర వినోదముల
సర్వసుఖము కంటే అత్యధిక సుఖము పొందుతున్న వారెవలె కనిపించారు.
ఈవింతను చూచిన మునులు తమ
రాజగు యమునికి విషయం తెలియజేశారు. అతడు మహిషారూఢుడై వచ్చి చూసి విస్మయం చెంది ఈ
వార్తను దేవేంద్రునికి తెలిపాడు. అతడు బ్రహ్మ విష్ణువులకు తెలుపగా వారు, వారితో పాటు నానా దిక్పాలకులైన దేవతుఆ కుండం చుట్టూ చేరి
కుంభీపాకము స్వర్గసుఖమిచ్చు విధాన్ని చూసి విస్మయులైనారు. బ్రహ్మాది దేవతలు ’ఈ అద్భుతానికి కారణమేమిటి?’ అని శ్రీహరిని ప్రశ్నించగా, ఆయన కూడా కారణం తెలుసుకోలేక కైలాసానికి వెళ్ళి పరమశివుని
చూచి "శంకరా! అర్థనారీశ్వరా! కందర్పకోటి సుందరాకారా! చంద్రార్థ భూషణా!
కుంభీపాకమునందుబడి అతి దుఃఖితులై ఆర్తనాదాలు చేయాల్సిన పాపులు వినోద కాలక్షేపాలతో
కేరింతలు కొడుతున్నారు. కారణం తెలియజేయండి" అని ప్రార్థించారు.
అందుకు పరమేశ్వరుడు
చిరునవ్వు నవ్వి "ఓ ఖగేంద్రవాహనా! ఇది అంతా భస్మ మహాత్మ్యము. అత్రినందనుడగు
దుర్వాసుడు ఒడలంతా భస్మాన్ని అలంకరించుకుని వచ్చి, ఆ కుంభీపాక కుండమున తొంగిచూచుచున్న సమయాన, ఆయన దేహమున గల భస్మ కణములు పాపులపై పడినవి, అందువల్ల వారి పాపాలు పటాపంచలయ్యాయి. వారు నిర్మలులయ్యారు.
భస్మము ధరించిన వారికి సుఖములే కానీ కష్టములు కలుగవు. భస్మరేణువులు పడిన ఈ కుండము
ఇకపై భస్మకుండమను పుణ్యతీర్థమవుతుంది. ఈ తీర్థమున స్నానము చేసినవారు సకల సౌఖ్యాలను
పొందుతారు. ఈ పితృలోకములోని వారు ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు.
లోకమాతయైన శ్రీదేవి ఇక్కడ పూజింపబడుతుంది" అని పలికాడు.
శివుడు చెప్పిన భస్మమహిమ
విని అచ్చెరువొంది, ఆ తీర్థమున స్నానమాడి
శివలింగాన్ని దేవీ స్వరూపమును ప్రతిష్ఠించారు. నాటి నుంచి అక్కడ భద్రగణములు
పరిపాలకులయ్యారు. కుంభీపాకము వేరొక దూరప్రదేశమున స్థాపించబడింది. నడిమి మూడు వేళ్ళతో,
లలాటము పైన ఎవరు భస్మాన్ని ధరిస్తారో వారు
పరమపావనులవుతారు.