హిందూ ధర్మ చక్రం
మహాభారతంలో శిఖండి పాంచాల మహారాజు ద్రుపదుని
కుమారుడు. పూర్వం కాశి రాజు తన కుమార్తెలైన అంబ, అంబిక,
అంబాలికలకు స్వయవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి భీష్ముని సోదరుడైన
విచిత్రవీర్యుని ఆహ్వానించక పోవడం తమకు అవమానమని భీష్ముడు స్వయంవరం నుండి ఆ
ముగ్గురినీ ఎత్తుకుని హస్తినాపురానికి చేరుకుంటాడు. మార్గంలో ఏ ఒక్క రాజు కూడా
భీష్మున్ని ఎదిరించలేక పోతారు. కానీ అంబను ప్రేమించిన ' శల్యుడు
' భీష్ముని ఎదిరించి ఓడిపోతాడు.
హస్తినాపురంలో విచిత్రవీర్యునికి అంబ, అంబిక,
అంబాలికలతో వివాహం జరిపించ సిద్ధం కాగ అపుడు అంబ తను శల్యుని
ప్రేమించిన విషయo తెలుసుకుని భీష్ముడు ఆమెను శల్యుని వద్దకే
పంపిస్తాడు. శల్యుని చేరిన అంబను యుద్ధంలో తనను ఓడిపోయినందున తిర్గి స్వీకరించలేను,
అలా చేస్తే లోకo నవ్వుతుందని అంబను శల్యుడు తిరస్కరిస్తాడు.
అటునుండి అంబ తిరిగి హస్తినాపురం చేరుకొని విచిత్రవీర్యుని వివాహం
చెసుకోమన్తున్ది. ఒకరు తిరస్కరించిన స్త్రీని తను వివాహమాడితే తానూ నవ్వులపాలు
అవుతానని విచిత్రవీర్యుడు కూడా కాదంటాడు. అపుడు అంబ తనను వివాహమాదాల్సిన్డిగా భీష్ముని
కోరుకుంటుంది. భీష్ముడు తన ప్రతిగ్న్య గూర్చి తెలిపి కాదంటాడు.
ఇలా ఎవరు తనను వివాహమాదక పోయేసరికి తన ఈ
పరిస్తితికి కారణమైన ' భీష్ముడి ' పైన
ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది అంబ . ఎందఱో రాజులను కలిసినా ఎవరూ
ఆమెకు సహాయం చేయరు. తరువాత జన్మలో ద్రుపద మహారాజుకు శిఖండినిగా
జన్మించి తన ప్రతీకారం గుర్తుంచుకుని ఒక యక్షుని సహాయంతో శిఖండిని నుండి శిఖండి గా
మారుతుంది.
కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి లాంటి వారిని చుస్తే
అస్త్ర సన్యాసం చేస్తానని భీష్ముడు తన మరణ రహస్యం శ్రీకృష్ణ పరమాత్మకు తెలుపుతాడు.
ఆ విధంగా శిఖండిగా మారిన అంబ భీష్ముడి పైన
ప్రతీకారం తీర్చుకుంటుంది. శిఖండి సహాయంతో అర్జునుడు భీష్ముని అంతమొందిస్తాడు. చివరకి శిఖండి కురుక్షేత్ర యుద్ధం 18వ
రోజున అశ్వత్థామ చేతిలో మరణిస్తాడు/మరణిస్తుంది.