సూర్య భగవానుడి ద్వాదశ రూపాలు
సూర్యభగవానునికి
మార్తాండుడు, ఆదిత్యుడు వంటి పేర్లతో పాటూ సహిత మిహిరుడు,
అర్కుడు, ప్రభాకరుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు వంటి
అనేక పేర్లు ఉన్నాయి. ఆ సూర్యభగవానుడు పన్నేండు రాశులలో పన్నేండు పేర్లతో
సంచరిస్తూ ఉంటాడు. ఋషులు,గంధర్వులు,అప్సరసలు,నాగులు,యక్షులు కూడా సూర్యునితో పాటూ ఉంటారు.
ఈ విధముగా
పన్నేండు నెలలలో, పన్నేండు పేర్లతో,పన్నేండు రూపాలతో సంచరిస్తూ ఉండటం వల్ల
సూర్యభగవానునికి " ద్వాదశాత్ముడు" అనే పేరు వచ్చింది. పన్నెండు
నెలల్లోనూ సూర్యుడుని ఒక్కొక్కనేలలో ఒక్కొక్క మంత్రంతో ఆర్ర్ధించి, నివేదన సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు
కలుగుతాయి.
సూర్యుని నామాలు
ఈ కృంద విధముగా ఉన్నాయి
చైత్ర మాసం - ధాత
జ్యేష్ట మాసం -
మిత్ర
ఆషాడ మాదం - వరుణ
శ్రావణ మాసం -
ఇంద్ర
భాద్రపద మాసం -
వివస్వాన
ఆస్వ్యుజ మాసం -
పుషా
కార్తీక మాసం -
పర్జన్య
మార్గశిర మాసం -
అంసుమన్
పుష్య మాసం - భగ
మాఘ మాసం -
తష్ట్యా
ఫాల్గుణ మాసం -
విష్ణువు
నిజానికి
సూర్యకిరణాల లీలా విలాసమే ఈ విశ్వమంతా!
ఓక్కొక్క మాసంలో
ఒక్కొక్క విధముగా ఉంటుంది. ఆయామాసాలలో సౌర
శక్తి విశేషాన్నే ఈ "ద్వాదశాదిత్యులు" అని పేర్కున్నారు. సూర్యుడుని
ఉపాసించినవారికి ఆయురారోగ్యాలు , ఐశవర్యం, అన్నసమృద్ధి లభిస్తాయి.
ఒక్కొక్క మాసం లో
ఆయనను ఆయా మంత్రములతో పూజిస్తే, విశేషమైన ఫలితాలు
లభించును. అలాగ ఇప్పుడు మాఘ
మాసంలో " తష్ట్వా " అని పిలువబడతాడు. ఈ మాసంలో
సూర్యుని వెంట బ్రహ్మరాత మహర్షి, కంబల సర్పము,
ఊర్వశి అప్సరస, ఋచీకుడు అనే రాక్షసుడు, శత్ జిత్ అనే యక్షుడు, ధృత రాష్ట్రుడు అనే గంధర్వుడు సంచరిస్తు ఉంటారు. ఈ మాసంలో చిత్ర
వర్ణంలో ,తొమ్మిది వేల
కిరణాలతో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ నెలలోని
ఆదివారాల్లో " శివాయ నమః " అనే మంత్రాన్ని పఠించడంతో పాటు, నిమ్మకాయలు, పండ్లు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ మాసంలో తష్ట్వా
సూర్యుడు వృక్షాలల్లోనూ, వివిధ ఔషదాలలోను
ఉండి ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. ఈ మాసం అంతా
సూర్యుడిని పూజించటం వల్ల అన్నింటా విజయం కలిగి, ఆయురారోగ్యాలతో వృద్ధి అవుతాయి. రథం పై ఆశీనుడై
ఉన్న ఒక చిన్న సూర్యుని విగ్రహాన్ని,లోహం తో చెసినది...ఒక పండితునికి దానం ఇవ్వడం కూడా శుభకరం!
శ్రీ సూర్యనారయణ
స్వామినే నమః.