శ్రీ పంచమి- సరస్వతి

సృష్టికర్త బ్రహ్మదేవుని అర్థాంగి అయిన సరస్వతీ దేవి ఆయన్ను సుసంపన్నం చేస్తుంది. సరస్వతీ దేవి నాలుగు చేతులు నాలుగు దిక్కులకు సంకేతం. ఆ అమ్మ శ్వేతవర్ణం బ్రహ్మ తేజస్సును ప్రతిఫలిస్తుంది. 

ఓం సరస్వతీ మహాభాగ్యే విద్యే కమలలోచనే
విశ్వరూపే విశాలాక్షీవిద్యాం దేహి నమోస్తుతే
జయజయ దేవి చరాచరశరీ కుచయుగ శోభిత ముక్తహారే
వినా రంజిత పుస్తక హస్తే భగవతి భారతి దేవి నమోస్తుతే.

సరస్వతీ దేవి నాలుగు చేతుల్లో ధరించిన - 
1) పుస్తకం : విజ్ఞానసర్వస్వం లాంటి వేదాలు 
2) జపమాల : అక్షరజ్ఞానాన్ని అందిస్తూ శ్రద్ధాసక్తులను  పెంచడానికి తోడ్పడుతుంది. 
3) వీణ : కళలకు సంకేతం. అంతేకాదు, అతీంద్రియ  శక్తులను అందించి మోక్షానికి దారితీస్తుంది. 
4) కమలం : సృష్టికి సంకేతం 
సరస్వతీ దేవి ధరించే తెల్లని చీర : స్వచ్ఛతకు నిదర్శనం 
సరస్వతీ దేవి అధిరోహించిన శ్వేత హంస : ఆత్మలన్నిటికీ మూలమైన పరమాత్మను సూచిస్తుంది.  సరస్వతీ దేవి పుట్టింది కూడా చల్లటి కాలంలో. చల్లదనం కారుణ్యానికి సంకేతం. ఒక్క మాటలో చెప్పాలంటే సరస్వతీ దేవి అపరిమితమైన స్వచ్చతకు, అపార జ్ఞానాకికి, కళలకు, సృజనాత్మకతకు, మోక్షసిద్ధికి కారకం, సూచకం.