పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ?

పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నముగ జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యక్త ఎంతో ఉంటుంది. అందుకే ఆసనం గురించి ఈ క్రింద విధముగా చెప్పారు.

                 ఆత్మ సిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానశ్చ ఆసనం పరికీర్తితం.


ఆత్మ ఙ్ఞాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి,నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, " ఆసనం" అత్యంతావశ్యకమైనదని చెప్పబడుతోంది.


ఇక " ఆ" అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, " స" అంటే సర్వరోగాలను హరిస్తూ, "నం" అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్ధం. పూర్వము పులిచర్మాన్ని, కృష్ణాజినం, కంబళి, దర్భాసనం, పట్టు వస్త్రం, నూలువస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించేవారు. చాల మందికి సందేహం ఎంటి అంటే పులి చర్మం నీ అంతటి అనుష్టానం చేసుకునే పెద్దలు ఉపయోగిస్తున్నరు అంటే ,వాటిని వారు హాని చేస్తారా అని....? వాటికి హాని చేకూర్చి చర్మాన్ని ఉపయోగించరు...అలా చేస్తే నిజంగానే మహా పాపం.... ఆ జంతువు తానంతట తాను శరీరం విడిచిపెట్టినది అయితేనే ఆ పులి యొక్క చర్మం ఆసనం క్రింద ఉపయోగపడ్తుంది. నేటి పరిస్తితులకు తగినట్లుగా పులిచర్మం,కృష్ణజీనం తప్ప మిగతావాటిని ఆసనాలుగా ఉపయోగించవచ్చు.