గుడిమల్ల పరశురామ దేవాలయం
చిత్తూరు జిల్లా
శ్రీ కాళహస్తి మండలం లోని ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము. చారిత్రకంగా చాల
ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన శివాలయం వుంది. ఇది
క్రీ.శ. 1 లేదా 2 శతబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన
శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. పురావస్తు శాస్తజ్ఞ్రుల పరిశోధన ప్రకారం
గుడిమల్లంలోని శివాలయం క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. భారత
పురావస్తు శాఖ . క్రీ.శ. 1973లో జరిగిన
త్రవ్వకాలలో ఈ ఆలయాన్ని జాతీయసంపదగా గుర్తించింది. ఈ ఆలయనిర్మాణానికి వాడిన రాతి
ఇటుకలు 42+21+6 సెంటీమీటర్ల
సైజులో ఉండటం వలన దీన్ని ఆంధ్ర శాతవాహనుల
కాలంలోని అంటే 1,2 శతాబ్దాల నాటి
నిర్మాణంగా గుర్తించడం జరిగింది. ఈ గుడిని తిరుమల గుడి కంటే చాల ప్రచీనమయినది అని అంటారు . ఈ శివలింగాని పరుశురాముడు పూజ చేసాడు కాబట్టి అ పేరు వచిందని కధనం . పాపనాయిడుపేట అనే ఊరికి 5 లేదా 10 km దూరంలో ఉంది గుడిమెల్లం అనే పల్లెటూరు.
శాసన ఆధారాలు:
దేవాలయ చరిత్ర...
ఈ దేవాలయాన్ని
కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు
చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడుచేసారు. కాకుంటే
మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.
గుడిమల్లం
శివలింగ విశిష్టత...
ప్రక్కన ఉన్న
లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలస్ లోనిది. కుడిచేతితో ఒక గొర్రెపోతు
(తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకోగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి
తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో,
చెవులకు అనేక రింగులు
ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ
చుట్టి, మధ్యలో క్రిందకు
వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్తమ్రు)
ధరించి ఉన్నాడు. ఆ వస్తమ్రు మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా
కనుపిస్తున్నాయి. ఆ వస్తమ్రు అతి సున్నితమైనది అన్నట్లుగా అందులో నుండి స్వామివారి
శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం.
లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్థంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన
పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము,
పురుషాంగమును పోలి ఉంది.
ఈ లింగము, అతిప్రాచీనమైన
లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.
ఆలయ ధ్వజస్ధంభం
స్థలపురాణం : పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించాడు. మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో
తల్లిని బ్రతికించుకున్నాడు. కాని తల్లిని
చంపిన నందుకు అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చిత్తం కోసం, ఋషుల సలహా ననుసరించి శివుణ్ణి ఆరాధించడానికి
బయలుదేరాడు. అత్యంతప్రయాసతో అడవి మధ్యలోని ఈ శివలింగాన్ని దర్శించాడు. ఈ
ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్మించుకొని, దాని ఒడ్డునే తపస్సు ప్రారంభించాడు. ఆ సరోవరంలో ప్రతిరోజూ ఒక్క పుష్పమే
పూసేది. దాన్ని శంకరునికి పూజాసమయంలో సమర్పించేవాడు పరశురాముడు. అడవి జంతువులనుండి
ఆ సరోవర పుష్పాన్ని కాపాడడానికి చిత్రసేనుడనే
ఒక యక్షుని కాపలాగా నియమించాడు పరశురాముడు. దానికి బదులుగా ఆ యక్షునకు ప్రతిరోజు ఒక జంతువును, కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
తిరుపతికి గానీ,
రేణిగుంటకి గానీ రైల్లో
చేరుకుంటే తిరుపతి నుంచైతే 22 కి.మీ., రేణిగుంట నుంచైతే 11కి.మీ. రోడ్డు ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకోవచ్చు.
అయితే ఇక్కడ సుప్రసిద్ధ ఆలయాల్లో మాదిరి ఉండేందుకు వసతి, హోటల్స్ లాంటివేమీ లేవు. మంచినీళ్లతో సహా మనమే
తీసుకుని వెళ్లాలి.