గోవుకు గడ్డి పెట్టేటప్పుడు
గోవుకు గడ్డి పెట్టేటప్పుడు,
తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని
పఠి౦చడ౦ శుభకర౦.
ప౦చభూతశివే! పుణ్యే!
పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦
సౌరభేయి! నమోస్తుతే!!
ప౦చ భూతాలకు శుభాన్ని
కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని
దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ
వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.
గోమాత దర్శనము చేయునప్పుడు
చదివే శ్లోకాలు:
నమో గోభ్యః శ్రీమతీభ్యః
సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ
పవిత్రాభ్యో నమోనమః ll
శ్రీమంతంబులై కామధేను
సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము
గావో మమాగ్రతః నను గావో మే
సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం
మధ్యే వసామ్యాహం ll
గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము.
గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను
సర్వ దేవమయే దేవి సర్వ
దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు
నందిని ll
ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము