పుణ్య నదులు

Pilgrim Bathing In Ganges, Maha Kumbh Mela, Allahabad, India by Eric Lafforgue, via Flickr

గంగ : మంగళ తరంగ - ఇందులో స్నానం చేసివారు సురలోక వాసులౌతారు.

గోదావరి : గోదావరి దివ్యనది. గోహత్య, బ్రహ్మహత్యాది పాపాలను తొలగిస్తుంది. ఈ నదికి దక్షిణ తీరాన గౌతమ మహర్షిచే ప్రతిష్ఠింపబడిన గౌతమేశ్వరాలయం ఉన్నది. (మంథని) మాఘమాసంలో నియమానుసారం స్నానాదానాదులు చేస్తే ఏడుజన్మల పాపాలు పోతాయి. కొన్ని ప్రాంతాల్లో గోదావరిని గంగ అని పిలుస్తారు.

ప్రయాగ : ఈ నది(వూతివేణి సంగమం)లో చేసేవారు సర్వపాప విముక్తులై సురలోక సౌఖ్యం అనుభవిస్తారు.

నైమిశారణ్యం : శౌనకాది మహామునులు, యజ్ఞాలు చేసిన పుణ్యభూమి.

శమంత పంచకం : ఇహపర సుఖాలిచ్చే దివ్యతీర్థం.

కురుక్షేత్రం : శ్రీ కృష్ణుడు, అర్జునునికి గీతోపదేశం చేసి, విశ్వరూప దర్శనమిచ్చాడు. భీష్ముడు తనువు చాలించి, ముక్తి పొందాడు. ఇక్కడ సార్వవూతికోటి తీర్థాలున్నాయని వాయుదేవుడు చెప్పాడు.

అవంతీ : ఈ నగరలో మాఘస్నానం చేసినవారికి శివలోక ప్రాప్తి సిద్ధిస్తుంది.

అయోధ్య : మాంధాత, హరిశ్చంవూదుడు, శ్రీరాముడు మున్నగు సూర్యవంశ రాజులు దయించిన మహానగరం. ఈ పట్టణానికి పక్కనే సరయూనది ప్రవహిస్తుంది. మాఘమాసంలో అయోధ్యలో స్నానం చేస్తూ దేవతలకూ, పితృదేవతలకూ తర్పణాలిస్తే అటూ, ఇటూ 20తరాల వారు తరిస్తారు.

మధువనం : మాఘమాసంలో ఇక్కడ స్నానం చేసినవారు విష్ణు సాయుజ్యం పొందుతారు.

యమున : నీల తరంగమూర్తియైన యమున కృష్ణునికెంతో ఇష్టమైంది. దీనిలో స్నానం చేసినవారు వైకుం

ద్వారక : విశ్వకర్మ నిర్మించిన ఈ పట్టణంలో ధర్మ సంస్థాపనకై అవతరించిన విష్ణువు శ్రీ కృష్ణునిగా నివసించాడు. సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘస్నానం చేస్తే సురలోక వాసులౌతారు.

మాయావతి : ఇక్కడ మల ప్రహారిణిఅనే నది ప్రవహిస్తూంది. ఈ నదిలో స్నానం చేసేవారి కల్మషాలను హరిస్తుంది. కనుక దీనికి మల ప్రహారిణిఅనే పేరు సార్థకమైంది. ఇక్కడ మాఘమాస వ్రతం చేసినవారు ఉభయలోక సౌఖ్యాలు పొందుతారు.

సరస్వతి : ఈ నదిలో స్నానం చేస్తే సరస్వతి అనుక్షిగహం కలిగి చివర బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణాలు విడిచి, బ్రహ్మపదం పొందుతారు.

గంగా సాగర సంగమం : గంగ సమువూదంలో కలిసేచోట మాఘ స్నానం చేసి తిలలను తినిపిస్తూ, నల్లని ఆవును దక్షిణతో సహా దానమిస్తే స్వర్గస్థులౌతారు.

కాంచి : దక్షిణ భారతదేశంలో పరమపావనమైన పట్టణం కంచి. మహావిష్ణువు లక్ష్మీదేవితో అవతరించాడు. అక్కడ స్నానాదానాలు చేసిన వారి పుణ్యం కోటి రెట్లు. అందుకే పుణ్యకోటి అంటారు. ఈ పట్టణానికి దక్షిణంగా వేగవతి నది ఉన్నది. ఈ నదిలో మాఘస్నానం చేసిన సర్వపాపాలు నశించి, స్వర్గసుఖాలనుభవిస్తారు.

త్రయంబకం : త్రయంబకమనగా ముల్లోకాల్లో పేరుపొందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో మాఘస్నానం చేస్తే తప్పక ముక్తి లభిస్తుంది. 
కావేరి తుంగ భద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
భాగీరథీ విఖ్యాతః పంచగంగా పరికీర్తితాః!!
ఈ ఐదు జీవనదులను పంచగంగలంటారు.

పంప : కాలాత్మక పట్టణానికి ఉత్తరం వైపు పంపానది ఉంది. దక్షిణం వైపు అదే పేరుతో పట్టణం ఉంది. మాఘమాసంలో ఉదయకాలంలో స్నానం చేసినవారు కైలాసవాసులౌతారు.

ప్రభాస తీర్థం : పంపానదికి అల్లంత దూరంలో లోక సంరక్షణకై శివుడు లింగరూపంతో అవతరించాడు. ఈ తీర్థానికి ప్రభాసం అని పేరు.

దిలీపరాజా! మాసాలన్నిటిలో మాఘమాసం ఉత్తమోత్తమం. మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’ మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారు పాప విముక్తలౌతారు. దిలీపుడు వశిష్ఠునికి నమస్కరించి, తన దేశంలో అనేక సత్రాలను, చెరువులను, బావులను, బాటసారులకై నెలకొల్పాడు. సద్గతిని పొందాడు. రాజులందరికీ ఆదర్శపురుషుడైనాడు.

త్రాహిమాం పుండరీకాక్ష! శరణ శరణాగతం

త్వమేవ సర్వభూతానాం, ఆశ్రయః పరమాగతిః