అఆఇఈ
అకారము పరమేశ్వరుని శిరస్సు. ఆకారము లలాటము.
ఇకారము కుడి కన్ను. ఈకారము ఎడమకన్ను. ఉకారము కుడి చెవి. ఊకారము ఎడమ చెవి. ఋకారము ఆ
పరమేశ్వరుని కుడి చెక్కిలి. ౠకారము ఎడమచెక్కిలి. అలు, అలూ కారములు రె౦డు ముక్కుపుటములు.
ఏకారము పై పెదవి. ఐకారము ఈశ్వరుని క్రి౦ది
పెదవి. ఓకారము పై పళ్ళవరుస. దేవదేవుడగు శివునికి అ౦ అః అనునవు
తాలు(దవడలు)స్థానములాయెను. వీటికి ప్రాణాక్షరములు అని పేరు.
క వర్గలోని ఐదు అక్షరములు(క
ఖ గ ఘ జ్ఞ) ఐదు కుడిచేతులు కాగా, చవర్గలోని ఐదు అక్షరములు
ఐదు ఎడమచేతులాయెను. టవర్గలో ఐదు, తవర్గలో ఐదు వెరసి పది
అక్షరములు పాదముల వ్రేళ్ళు ఆయెను. పకారము ఉదరముకాగా, ఫకారము కుడి పార్శ్వము ఆయెను. బకారము ఎడమ పార్శ్వము కాగా
భకారము స్క౦ధమాయెను. యోగీశ్వరుడు, మహాదేవుడగు శ౦భువునకు
హృదయము మకారము. సర్వవ్యాపియగు శివునకు యకారము మొదలుగ సకారము వరకు గల ఏడు అక్షరములు
ఏడు ధాతువులు(చర్మము, రక్తము, మా౦సము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్ర౦) ఆయెను. హ కారము నాభి అనియు, క్షకారము ఘ్రాణే౦ద్రియము అనియు చెప్పబడెను. వీటికి
ప్రాణ్యక్షరములు అని పేరు.