భగవంతుడు భక్త పరాధీనుడు
యుగాలు నాలుగు అని మనకి
తెలిసిన విషయమే...ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం ఉంటుంది. కృతయుగంలో ధ్యానం,
త్రేతాయుగంలో యాగం, ద్వాపరయుగంలో అర్చనాదులు యుగ ధర్మాలు, ఆయాకాలాలలో ఆయా యుగధర్మాలను అనుసరించే జీవనయానాన్ని
సాగించాలని అంటారు.
మరి, ఈ కలియుగ ధర్మం ఏంటి?
కృత, త్రేతా, ద్వాపరయుగాలలో వేటినైతే
పాటించి లబ్ధి పొందామో, వాటి అన్నింటి ఫలితాన్ని
భగవానుని సంకీర్తనల ద్వారా కీర్తించి పొందగలమన్నది పెద్దలవాక్కు. ఇది నిజం.
ఒకసారి, ఈ విషయాన్ని గురించే శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు
అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు
నిరంతరం అని ఆయనను అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం " తను ఒక
పెద్ద ఆయనను తలచుకుంటున్నాను అని....." ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం
తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న
ఆ పుణ్యమూర్తి ఎవరు?
" నేను ప్రస్తుతం
స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని.....ఆ భక్తుడే భీష్మపితామహుడు" అని కృష్ణ
పరమాత్మ అసలు విషయాన్ని చెప్పాడు.
అవును....భగవంతుడు భక్త
పరాధీనుడు. భక్తుడెంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ
సర్వాంతర్యామి తన భక్తుని యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. అందుకే భక్తి
ఎక్కడో భగవంతుడు అక్కడ అని అన్నారు.