శ్రీ పరాశర మహర్షి పెట్టిన నియమము


ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకము "

ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం ! రామదూతం నమామ్యహం 1".

మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తరువాత ఒక చోట ఆగి పై శ్లొకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లొకములు చెప్పు కొరాదట.

ఏ గుడిలొనైనను ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఒక తొమ్మిది నెలల గర్భిణి స్త్రీ ఎంత నిధానముగ నడుస్తుందో అంత నిధానముగ చేయాలి కాని, అంతకు మించిన వేగముతొ చేయరాదు. ఎన్ని ప్రదక్షిణలు చేసామో లెక్కపెట్టుకోడానికి, వక్కలు, పసుపు కొమ్ములు లేక బియ్యము కాని వినియోగించుకోవాలి తప్ప వేళ్ళతో లెక్కపెట్టొకొవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్తో గుర్తు పెట్టుకోడము లాంటివి కూడదు.

మూల విరాట్టుకు అభిముఖముగ నిలబడి నమస్కరించకూడదు. ప్రక్కకు నిలబడి నమస్కారము చేసుకోవాలి. ఒకవేళ ప్రక్కకు నిలబడినప్పుడు మనము దక్షిణ దిక్కుకు అభిముఖముగ నిలబడ వలసి వస్తే కొద్దిగా పక్కకు తిరిగి నమస్కారము చేసుకోవాలి కాని దక్షిణ దిక్కుకు అభిముఖముగా నమస్కారము చెయరాదు - శ్రీ చాగంటి గారి " హనుమ వైభవము " ప్రవచనము