మహా శివునుకి "త్రిపురాంతక" అని పేరు ఎలా వచ్చింది?
పూర్వం
తారకాసురడనె రాక్షసుణ్ని కుమార స్వామి సంహ రించాడు. తారకాసురుని ముగ్గురు కుమారులు
తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చు కోవాలని బ్రంహదేవుడి కొరకు తపస్సు చేస్తారు.
బ్రంహ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.... "మాకు మరణం వుండకూడదని"
వరమివ్వాలని కోరు కుంటారు. అది అసాద్యమని బ్రంహ చెప్పగా.... వారు "గగన
మార్గాన ప్రయాణించే.... అందులో సకల సౌకర్యాలుండే మూడు నగరాలు కావాలని" కోరు
కుంటారు. దానికి బ్రంహ వారి కోరికను తీరుస్తూ " ఆ మూడు నగరాలు విడి విడిగా
వున్నంత కాలం మీకు తిరుగు లేదు .... అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనులౌతారు"
అని వరం ఇస్తాడు. దాంతో త్రిపురాసురులు రెచ్చి పోయి ముల్లోకాలను గడ గడ లాడించారు. ఆ వరాలు ఫలితంగా ఒకొక్క రాక్షసుడు ఒకొక్క లోహాలలో దాగి ఉంటారు. తారకాక్ష బంగారములోని, విద్యున్మలి వెండి లోని, కమలాక్ష సీసము లోని ప్రవేశించి మానవులని, దేవతలని భయబ్రాంతులని చేస్తూ, విద్వాంసం సృష్టిస్తారు. దాంతో దేవతలు బ్రంహకు మొర పెట్టుకోగా.... బ్రంహ వారిని వెంట పెట్టుకొని శివుని
వద్దకు వెళ్లి శరణు వేడు తారు. అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్కదగ్గరికి చేరిన
సమయం చూసి ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరించాడు.
దేవతలు అందరూ మహా శివునికి
తమ ఆవేదలని వ్యక్తం చేస్తూ, శరణం కోరుతారు . ఆ ముగ్గురి
రాక్షసులని అంత మొందించడానికి పరమ శివుడికి దేవతలందరూ సహాయాన్ని అందిస్తారు.
1) మేరు పర్వతం మరియు
ఓంకారములు "బాణము" గా మారతాయి.
2)భూమి మరియు ఇతర దేవతలు
"రధము" గా మారతారు.
3)నాలుగు వేదాలు "నాలుగు
గుర్రాలు"గా మారుతాయి.
4)బ్రహ్మ రధ సారిధి గా తన
సేవలు అందిస్తారు.
5) వాసుకి సర్పము విల్లుకి
తాడుగా మారుతుంది.
6)మహా విష్ణువు బాణముగా(Arrow
) గా మారుతారు.
7) సూర్యుడు, చంద్రుడు రధ చక్రములుగా(wheels ) మారుతారు.
వీరి అందరి సహాయముతో పరమ
శివుడు ముగ్గురు రాక్షసులని సంహరించడం వలన "త్రిపురాంతక" అని పేరు
వచ్చింది. తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమ శివుడు త్రిపురాతకేశ్వరుడుగా లింగ రూపంలో ఈక్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం.