దీపావళి 3 లేదా 4 రోజులు జరుపుకుంటారు
ఈ దీపావళిని మొత్తం 3 లేదా 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు.
మొదటి రోజు - ధన త్రయోదశి -
దీనినే ధన తెరస్ అని కూడా అంటూ ఉంటారు. క్షీర సాగర మధనం జరిగినప్పుడు అందులోనుంచి
ధన్వంతరి చేతిలో అమృత కలశంతో ఈ రోజునే ఉద్భవించారు. ఈ రోజున ఆవు నేతితో దీపం
వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే కుబేరుడు మన ఇంట్లో కొలువుంటాడుట. అందువలననే ఈ
రోజున ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు.
రెండవ రోజు - నరక చతుర్దశి
- కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామికీ, భూదేవికీ అసుర సంధ్యా సమయములో నరకుడు అనే రాక్షసుడు
జన్మిస్తాడు. ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన
వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు
పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు మితిమీరడంతో సత్యభామ అతనిని వధిస్తుంది. అలా ఈ
రోజున ఆయన మరణించిన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపైన నువ్వుల
నూనె పెట్టుకుని, చక్కగా బాణసంచా కాల్చి
(అసలు ప్రొద్దున్నే లేవడం బద్ధకమయినా పోటా పోటీగా కాల్చే బాణసంచా కోసం అన్నా
లేచేదానిని) అప్పుడు తల మీద ఉత్తరేణి ఆకులు పెట్టుకుని తలంటు పోసుకుంటారు. క్రొత్త
అల్లుళ్ళ చేత మినుము కొరికించడం ఆనవాయితీ. ఈ రోజున చాలా మంది మినప ఆకులతో కూర
వండుకుంటారు. అనేష సేముషీ మూష మాష మానస్య మానతే అన్నారు కదా!
మూడవ రోజు - దీపావళి
అమావాస్య - ఇది ముఖ్యమయిన పండుగ. ఈ రోజు ఈ పండుగ చేసుకోవడానికి చాలా కారణాలు
ఉన్నాయి. అవేమిటంటే:
రావణాసురునితో యుద్ధం జరిపి
విజయరాముడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన రోజు అమావాస్య కావడం వలన చీకటి నిండి
ఉండగా అయోధ్య ప్రజలు సీతారాములకి స్వాగతం పలుకుతూ దీపాలని వెలిగించారని ఆ రోజు
నించి ప్రతీ సంవత్సరం ఆ రోజున దీపావళి జరుపుకుంటున్నారని చెప్తారు.
నరకాసురుడు మరణించాడు కదా!
ఆనందములో ఈ రోజున దీపావళి జరుపుకుంటారు.
క్షీర
సాగర మధనములో లక్ష్మీ దేవి ఈ రోజునే ఉద్భవించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే
లక్ష్మీదేవికి అందుకనే ఈ రోజు సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. దీని
వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే: పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని
ఆతిథ్యానికి మిక్కిలి సంతోషించి, ఒక మహిమాన్వితమైన పూల
హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము
అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో త్రొక్కడం జరుగుతుంది. అది చూసిన
దుర్వాసుడు కోపంతో దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును
కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని
దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ
మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా
తలచి పూజించమని సూచిస్తాడు. అలా ఇంద్రుని భక్తికి తృప్తిచెందిన లక్ష్మీదేవి
అనుగ్రహం వలన తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను
పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
మాయాజూదంలో ఓడిపోయిన
పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి
చేసుకుని ఈ రోజునే తిరిగి వస్తారు. దానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు.
గ్రామీణ ప్రాంతాలలో పంట
చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మన రైతన్నలు దీపావళి పండుగను
చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు కృతజ్ఞతగా దీపాలు వెలిగించి
ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తారు. విక్రమార్కునికి పట్టాభిషేకం కూడా ఈ రోజే
జరిగింది.
తైలే లక్ష్మీర్జలే గంగా
దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం
తైలాభ్యంగో విధీయతే!!
ముఖ్యముగా ఈ రోజున నువ్వుల
నూనెలో లక్ష్మీ దేవి; నదులు, బావులు, చెఱువులు మొదలయిన నీటి
వనరులలో గంగా దేవి ఉంటారుట. కనుక ఈ రోజున సూర్యుడు ఉదయించే సమయములో (ప్రత్యూష లేదా
అరుణోదయ కాలం) మఱ్ఱి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి.
పిదప నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి. ప్రధాన ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు ఈ అయిదు
ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. ఇలా చేయుడం వలన దారిద్ర్యం తొలగి,
గంగానదీ స్నాన ఫలం వలన నరక భయం ఉండదని పురాణాలు
చెపుతున్నాయి. స్త్రీలు అభ్యంగన స్నానానంతరం క్రొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు
రంగురంగుల ముగ్గులు వేసి, గుమ్మాలను పసుపు, కుంకుమ మామిడాకుల తోరణాలతో అలంకరించి సాయంత్రం లక్ష్మీపూజకు
సన్నాహాలు చేసుకొంటారు.
ఈమే తండ్రి సత్రాజిత్తుకు ఈ
బాణసంచ చేసే విద్యను సూర్యుడు బోధించినట్లుగా "భాగవతం" పేరుకుంతొంది.
ఈ విద్యను సత్రాజిత్తు తన
కుమార్తేకు ధారపోసాడని పురాణ కధనం.
నేటి ఆధునిక బాణ సంచాకు
ముందు తాటి గిలకల పూలమట్టాలను,, జనపకట్టెల జుంజుం కట్టలను,
పెద్ద నేపాళ విత్తనాలను పుల్లలకు గుచ్చి,
వెలిగించి ఆనందించేవారు.
అవి నేటి కాకరపువ్వొత్తులు,మతాబులు,చిచ్చుబుడ్డ్లుకు సమానం.
సబ్దాలు చేసే, వెలుగును ఇచ్చే బాణ సంచ
వెనుక ఒక పురాణమైన, శాస్త్రపరమైన మరో సత్యం
దాగి ఉంది. మహాలయ పక్షంలో పైలోకాల నుండి భూమికి దిగివచ్చిన పితృదేవతలు దీపావళి
రాత్రి తిరిగి పయనమై ఊర్ధ్వలోకాలకు వెల్లే సమయము. ఈ వెలుగు
ఆశ్వయుజ బహుళ చతుర్దశి అనగా
( నరక చతుర్దశి)
అయితే ఈ పండగల గురించి
కొన్ని తెలియని రహస్యాలు ప్రాచీన గ్రంధాలలో దాగున్నాయి.
చతుర్దశ్వాంతుయే
దీపాన్నరకాయ దదంతిచ
తేషాం పితృ గణః సర్వే
నరకాత్ స్వర్గమాప్నురయః
అంటే చతుర్దశి తిధి నాడు
నరకలోకంలో ఉన్న పితృదేవతల కోసం దీపాలు వెలిగించితే, వారు స్వర్గలోక వాసాన్ని పొందుతారని అర్ధం.
ఆశ్వయుజ కృష్ణపక్షస్య
చతుర్దాశ్యాం విధూదయే
తిల తైలేన కర్తవ్యం స్నానం
నరక భీరుణా
ఆశ్వియుజ కృష్ణ చతుర్దశి
నాడు చంద్రోదయానికి ముందు గానే నువ్వులు నూనేతో అభ్యంగన స్నానం చెయ్యాలి.(తలంటి
స్నానం)
స్నానాంతరం తప్పనిసరిగా యమ
తర్పణం విడవాలి.
ఇక్కడ చంద్రోదయ కాలానికి
ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది .
అప్పటికి ఒక గంట లోపు మాత్రమే , రాత్రి సమయం
ఉంటుంది.సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత
చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని "
గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం)
దీపావళి సమయంలో నువ్వుల
నూనేతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి
అమావాస్య సమయాలలో నువ్వుల నూనేను లక్ష్మి దేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు
చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా
కలియబెట్టాలి.ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం
చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి
చురుకుదనం పెరుగుతుంది.
సీతాలోష్ట సమాయౌక్తః సంకట
దళాన్వితః
మారపాప మపామార్గ
భ్రామ్యమాణః పునః పునః
ఈ శ్లోకం ద్వారా చతుర్దశి
అభ్యంగాన్ని చెయ్యాలి.
నరక చతుర్దశి నాడు నరక బాధ
తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు)
ఉత్తరేణి ఆకులను తల పై పెటుకుని, పదునాలుగు నామాలతో, తిల్లలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.
యమాయ నమః
మృత్యువేనమః
వైవస్వతాయనమః
సర్వభూతక్షయాచ నమః
ధ్ధ్నాయనమః
పరమేష్టినే నమః
చిత్రాయ నమః
ధర్మరాజాయ నమః
అంతకాయ నమః
కాలాయ నమః
ఔదుంబరాయ నమః
నీలాయ నమః
వృకోదరాయ నమః
చిత్రగుప్తాయతే నమః
అంటు పదునాలుగు నామాలను
ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు
చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి
సమర్పించవలేను.
కాబట్టి నరక చతుర్దశి
నరకలోకవాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ అని, అందుకే ఈ రోజున, తల్లి తండ్రులు
లేని వారు తప్పకుండా దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి.
చతుర్దశి నాటొ సాయంకాలం
ప్రదోషకాలములో దీపదానం చెయ్యాలి.
దేవాలయాలలో దీప పంక్తులు
ఏర్పాటు చెయ్యాలి. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందటానికి దీపావళి చతుర్దశి నాడు,
కార్తిక సుద్ధ పాడ్యమి నాడు తప్పకుండా దీపదానం
చెయ్యాలి.
దీపావళి
దీపమాలికలతో ఆశ్వియుజ కృష్ణ
అమావాశ్య నాడు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిదేవికి నీరాజనాలు అర్పించే రోజు ఈ
దీపావళి అని చెప్పబడుతోంది. రాక్షస రాజు అయిన బలి పాతాళానికి అణగద్రొక్కబడినది,
శ్రీ రాముడు పట్టాభిషిక్తుడుదైనది, విక్రమార్క చక్రవర్తికి పట్టాభిషేకం అయినది ఈ దీపావళి
రోజునే కావడం విసేషం.
ఈ రోజున లక్ష్మి దేవి
భూలోకానికి దిగి వచ్చి, ప్రతి ఇంటా తిరుగుతు
ఉంటుంది, కాబట్టి ఇళ్ళను శుబ్ర
పరుచుకుని, శుచిగా ఉంచుకొవలన్నది ఈ
పండుగ ప్రథమ నియమం.
బలిని పాతాళానికి పంపిన
వామనమూర్తి , అథడి చెరలోనున్న దేవతలను
విడిపించి, తనతో పాటుగా క్షీరాబ్ది కి
తీస్కునివెళ్ళింది అన్న రోజు ఈ రోజు కావడం వల్ల లక్ష్మిదేవికి ఈ రోజు అత్యంత
ప్రీతికరమైన రోజు.
బాణ సంచా
దీపావళి నాడు పేల్చే
టపాకాయలుకు (బాణసంచా) ఒక పురాణ కధనమే ఉంది. ప్రప్రధమముగా బాణసంచాను రూపొందించింది
శ్రీ కృష్ణుని పత్ని సత్యభామ !
వారికి కాంతి బాటగా ఉండాలనే
సద్ద్యుద్దేసముతో. సర్వే జన సుకినో భవంతు